[ad_1]
తాజా నివేదిక..
ప్రస్తుత మాంద్యం సమయంలో ప్రపంచంలోని కేవలం 37 శాతం దేశాల్లో మాత్రమే ఉద్యోగులకు జీతాల పెరుగుదల ఉంటుందని ఒక సర్వేలో వెల్లడైంది. కానీ చాలా దేశాల్లో ఉన్న జీతాలను తగ్గించటం వంటి చర్యలకు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. దీనికి అంతర్జాతీయంగా ఉన్న అనేక పరిస్థితులు ప్రధానంగా కారణంగా నిలుస్తున్నాయి.
జీతాల తగ్గింపు ఇక్కడే..
వర్క్‌ఫోర్స్ కన్సల్టెన్సీ ECA ఇంటర్నేషనల్ ప్రకారం అత్యంత నష్టపోయిన ప్రాంతం యూరప్‌లో ఉండే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో నామమాత్రపు వేతన పెంపులు ఉంటాయని తెలుస్తోంది. యూకేలోని ప్రజలు ఈ ఏడాది అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారని తెలుస్తోంది.2000 సంవత్సరం తర్వాత ఇది అత్యంత స్వల్పమని తెలుస్తోంది. సగటు నామమాత్రపు వేతన పెంపు 3.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.
భారత్ లో వేతనాలు..
రియల్ టైం జీతాల పెరుగుదలను గమనించినట్లయితే ఆసియా ప్రాంతోని టాప్-10 దేశాల్లో ఎనిమిదింటిలో మాత్రమే వేతనాల పెంపు ఉంటుందని వెల్లడైంది. భారతదేశంలో 4.6 శాతం, వియత్నాంలో 4 శాతం, చైనాలో 3.8 శాతం మేర జీతాలు పెరుగుతాయని నివేదిక చెబుతోంది. దీని తర్వాత బ్రెజిల్ లో 3.4 శాతం, సౌదీ అరేబియాలో 2.3 శాతం మేర పెరుగుతాయని తాజా సర్వేలో వెల్లడైంది.
మిగిలిన దేశాలు..
ఇక జీతాలు పెరిగే ఇతర దేశాల జాబితాను గమనించినట్లయితే మలేషియా 2.2 శాతం, కంబోడియా 2.2 శాతం, థాయిలాండ్ 2.2 శాతం, ఒమన్ 2 శాతం, రష్యా 1.9 శాతం జీతాలను పెంచే టాప్ దేశాల జాబితాలో నిలిచాయి. ఇక దిగువున ఉన్న దేశాల జాబితాను గమనిస్తే పాకిస్థాన్, ఘనా, టర్కీ, శ్రీలంక, అర్జెంటీనీ వంటి దేశాలు దిగువన ఉన్నాయి. మెుత్తానికి 2023లో జీతాలు అత్యధికంగా పెరిగే దేశాల జాబితాలో ఇండియా మెుదటి స్థానంలో నిలిచింది.
[ad_2]
Source link
Leave a Reply