[ad_1]
ఎస్బీఐ ఆఫర్..
దేశంలోని అతిపెద్ద రుణదాతగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా “campaign rates” పేరుతో ప్రమోషన్ మెుదలు పెట్టింది. ఇందులో భాగంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను 30-40 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తోంది. ఈ తగ్గింపు ప్రయోజనాలు మార్చి 31, 2023 వరకు రుణాలు పొందేవారికి ఆఫర్ అందుబాటులో ఉండనుంది. దీనికింద SBI నుంచి కొత్త ఆఫర్‌ను పొందే కస్టమర్లు 8.6 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లతో ప్రామాణిక హోమ్ లోన్‌లను పొందవచ్చు.
క్రెడిట్ స్కోర్..
అయితే ఈ వడ్డీ డిస్కౌంట్ ఆఫర్ క్రెడిట్ స్కోర్ 700-800 మధ్య ఉండే కస్టమర్లకు వర్తిస్తుందని బ్యాంక్ వెల్లడించింది. ప్రమోషన్ ఆఫర్ ప్రకారం.. CIBIL స్కోర్ కనీసం 800పై ఉన్న కస్టమర్లకు రుణ రేటులో 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును అందిస్తోంది. ఇక 700 నుంచి 799 మధ్య క్రెడిట్ స్కోర్ ఉండే కస్టమర్లకు గృహ రుణంపై 40 బేసిస్ పాయింట్ల మేర రాయితీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
సిబిల్ స్కోర్ లేనివారికి..
ఎస్బీఐ సిబిల్ స్కోర్ లేని కస్టమర్లకు, NTC/-1 స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు 30 బేసిస్ పాయింట్ల మేర రాయితీని అందిస్తోంది. ఈ కేటగిరీ కింద వచ్చే వారికి రుణాన్ని 9.10 శాతానికి బదులుగా 8.80 శాతం వడ్డీ రేటుకే అందించనుంది. అలాగే సిబిల్ స్కోర్ 650-699 పాయింట్ల మధ్య ఉండే గృహ రుణగ్రహీతలకు 9.20 శాతం స్థిర రేటుకు అందిస్తోంది. అలాగే 550-649 మధ్య స్కోర్ లపై రేటు 9.20 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.
ప్రత్యేకంగా..
స్టేట్ బ్యాంక్ మహిళలకు రుణం విషయంలో 5 బేసిస్ పాయింట్ల మేర ప్రత్యేక వడ్డీ రాయితీని అందిస్తోంది. ఇదే క్రమంలో రక్షణ రంగంలో సేవలు అందిస్తున్న వారికి స్పెషల్ గా 10 బేసిస్ పాయింట్ల రాయితీని ఆఫర్ చేస్తోంది. అలాగే క్రెడిట్ స్కోర్ 750 పాయింట్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే.. వారికి సైతం గృహ రుణం కింద 5 బేసిస్ పాయింట్లు రాయితీని బ్యాంక్ కల్పిస్తోంది.
ప్రాసెసింగ్ ఫీజు..
స్టేట్ బ్యాంక్ తన ఆఫర్లో భాగంగా కేవలం వడ్డీ రాయితీలకు మాత్రమే పరిమితం కాలేదు. రెగ్యులర్, టాప్ అప్ లోన్స్ పై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. రుణాలు పొందాలనుకునే వారు ఈ ప్రయోజనాలను వినియోగించుకునేందుకు వెంటనే మీకు సమీపంలోని స్టేట్ బ్యాంక్ శాఖను సంప్రదించటం ఉత్తమం.
[ad_2]
Source link