[ad_1]
గణిత సామర్థ్యమూ అంతంతే..
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థుల గణిత సామర్థ్యాన్ని పరిక్షిస్తే 48.1 శాతం నుండి 44.7 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. పాఠశాలల మూసివేత సమయంలో పాఠ్యాంశాలు నేర్చుకోకపోవడం వల్ల ఏర్పడిన నష్టాలు మునుపెన్నడూ లేని స్థాయిలో ఉన్నాయని తెలిపింది.
త్వరితగతిన పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని ఈ సర్వే నిర్వహించిన ప్రథమ్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రుక్మిణి బెనర్జీ అభిప్రాయపడ్డారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులకు మక్కువ చూపుతున్నట్లు అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల నిష్పత్తి 2018లో 65.6 శాతం నుంచి 2022లో 72.9 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
బడి బయట పిల్లల్లోభారీ తగ్గుదల
616 జిల్లాల నుంచి 7 లక్షల మంది పిల్లలను 2022లో సర్వే చేసినట్లు ఏఎస్‌ఈఆర్ తెలిపింది. ప్రస్తుతం పాఠశాలకు వెళ్లని 6-14 ఏళ్ల వయస్సు గల వారి సంఖ్య 1.6 శాతానికి తగ్గినట్లు నివేదికలో చెప్పింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన అనంతరం గత దశాబ్దంలో ఇదే తక్కువ కావడం శుభసూచకమని ఏఎస్‌ఈఆర్ డైరెక్టర్ విలిమా వాధ్వా అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగినా, ప్రైవేట్ ట్యూషన్‌లకు సైతం వెళుతుండటం వల్ల విద్య కోసం పెట్టే ఖర్చు తగ్గకపోవచ్చన్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు ట్యూషన్ కు వెళ్లే విద్యార్థుల నిష్పత్తి 2018లో 26.4 శాతం నుంచి 2022లో 30.5 శాతానికి పెరిగినట్లు చెప్పారు.
పెరుగుతున్న సౌకర్యాలు.. క్షీణిస్తున్న సామర్థ్యాలు
జాతీయ స్థాయిలో పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడినా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వెనుకంజలోనే ఉన్నట్లు ఏఎస్‌ఈఆర్ విశ్లేషించింది. 28 రాష్ట్రాల్లో గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో సహా 9 రాష్ట్రాల్లో 2010తో పోలిస్తే పాఠశాలల్లో తాగునీటి లభ్యత మందగించిందని నివేదించింది. హర్యానా, కేరళ, మహారాష్ట్రతో సహా 12 రాష్ట్రాల్లో 2018తో పోలిస్తే బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడంలోనూ విఫలమైనట్లు తెలిపింది.
[ad_2]
Source link
Leave a Reply