బాలీవుడ్ నటుడు సహా 31 మందికి పెనాల్టీ:

సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 50 ఎంటిటీలను నిషేధిస్తూ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI) ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి, ఆయన భార్యతో సహా మరో 31 కి పెనాల్టీ విధించింది. లిస్ట్ కాబడిన సాధ్నా బ్రాడ్ కాస్ట్, షార్ ప్లైన్ బ్రాడ్ కాస్ట్ లకు అనుకూలంగా పంప్ అండ్ డంప్, స్టాక్ ధరలు మానిప్యులేషన్‌ కు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వీటి ద్వారా వరుసగా రూ.41.85 కోట్లు, రూ.12.14 కోట్లు వారు లబ్ధి పొందినట్లు పేర్కొంది.

ప్రైస్ మానిప్లేషన్, షేర్ల ఆఫ్ లోడింగ్:

ప్రైస్ మానిప్లేషన్, షేర్ల ఆఫ్ లోడింగ్:

యూట్యూబ్ ఛానళ్లలో వ్యాపారులు, మార్కెట్ విశ్లేషకులు.. పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే వీడియోలు, మార్కెటింగ్ ప్రచారాలు ద్వారానిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తద్వారా అసాధారణ లాభాలను సైతం పొందినట్లు ఆరోపించింది. కొన్ని స్టాక్లలో ప్రైస్ మానిప్లేషన్, షేర్ల ఆఫ్ లోడింగ్ జరిగిందంటూ తమకు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది. తప్పుడు ప్రకటనలు, ప్రచారాల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేస్తున్నారంటూ తమను ఆశ్రయించారని చెప్పింది. ఈ తరహా వ్యవహారాలు జరిపే ఆయా యూట్యూబ్ ఛానళ్లకు లక్షలాది సబ్ స్క్రైబర్లు ఉండగా, కోట్ల వ్యూయర్ షిప్ ను గుర్తించినట్లు పేర్కొంది.

ఇన్ఫ్లూయర్స్ జర జాగ్రత్త:

ఇన్ఫ్లూయర్స్ జర జాగ్రత్త:

తప్పుదోవ పట్టించే ప్రచారాలు చేస్తూ, ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న వారిని అడ్డుకోవడంలో భాగంగా.. బాలీవుడ్ నటుడి సహా పలువురిపై సెబీ ప్రస్తుతం చర్యలు తీసుకుంది. పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తే క్రమంలో పలు సూచనలు చేసింది. అయితే ఈ తరహా వ్యవహారాలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట నిబంధనలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఇన్ఫ్లూయర్స్ సైతం తమ సంభాషణలో పారదర్శకతతో పాటు వాస్తవాలను ప్రజలకు వివరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *