News
oi-Mamidi Ayyappa
దేశంలో
వ్యవసాయ
రంగం
మంచి
వృద్ధిని
సాధించిందని
తెలిపారు.
సేవల
రంగం
కూడా
ఇదే
పనితీరు
కనబరిచిందని
దాస్
చెప్పారు.
ఇదే
సమయంలో
ప్రభుత్వం
చేసే
క్యాపిటల్
అండ్
ఇన్‌ఫ్రా
ఖర్చులు
పెరిగాయని
వెల్లడించారు.
అలాగే
ప్రైవేట్
పెట్టుబడులు
కూడా
పునరుద్ధరణకు
సంబంధించిన
ఆధారాలు
ఉన్నాయని
శక్తి
కాంతదాస్
పేర్కొన్నారు.
ఆర్‌బిఐ
తాజా
సర్వే
ప్రకారం
తయారీ
రంగంలో
సామర్థ్య
వినియోగం
దాదాపు
75%
ఉందని
తెలిపారు.
LIVE
|
RBI
Governor
Shaktikanta
Das
speaks
at
CII
Annual
Session;
WATCH
#RBI
@RBI
@DasShaktikanta
@FollowCII
https://t.co/P2YRyYd7JM—
ET
NOW
(@ETNOWlive)
May
24,
2023
ద్రవ్యోల్బణంపై
చేస్తున్న
యుద్ధం
ఇంకా
ముగియలేదని,
మనం
జాగ్రత్తగా
ఉండాల్సిందేనని
ఈ
సందర్భంగా
రిజర్వు
బ్యాంక్
గవర్నర్
తెలిపారు.
అయితే
రానున్న
కాలంలో
వడ్డీ
రేట్ల
పెంపు
కొనసాగుతుందా
లేదా
అన్నది
ఆర్థిక
వ్యవస్థపై
ఆధారపడి
ఉంటుందని
ఆర్‌బీఐ
గవర్నర్
శక్తికాంత
దాస్
పేర్కొన్నారు.

మే
నెలలో
రిటైల్
ద్రవ్యోల్బణం
ఏప్రిల్‌లో
కంటే
తక్కువగా
ఉంటుందని
రిజర్వ్
బ్యాంక్
గవర్నర్
తెలిపారు.
రిటైల్
ద్రవ్యోల్బణం
రేటు
ఏప్రిల్‌లో
18
నెలల
కనిష్ఠ
స్థాయి
4.70
శాతానికి
చేరుకున్న
సంగతి
తెలిసిందే.
ఏడాది
కిందట
ఏప్రిల్
2022లో
రిటైల్
ద్రవ్యోల్బణం
7.79
శాతంగా
ఉంది.
దేశంలో
ఎల్
నినో
ఏర్పడితే
అది
వ్యవసాయాన్ని
దెబ్బతీస్తూ
ఆర్థిక
అస్థిరతకు
కారణమౌతుందన్నారు.
ఈ
ఒత్తిడి
వ్యవసాయ
రుణాలపై
ఉండటంతో
పాటు
ఎన్పీఏలు
పెరుగుతాయని
అభిప్రాయపడ్డారు.

English summary
RBI governor Shaktikanta Das spoke on inflation and GDP at CII meeting
RBI governor Shaktikanta Das spoke on inflation and GDP at CII meeting
Story first published: Wednesday, May 24, 2023, 14:23 [IST]