Sore Throat : ఈ టీ తాగితే గొంతునొప్పి ఇట్టే తగ్గుతుందట..

[ad_1]

Sore Throat : కొంతమంది ఈ గొంతునొప్పి రాగానే ఏవేవో మందులు వేయడం, వేసుకోవడం చేస్తుంటారు. కానీ, ఇది ఎప్పుడు అంత మంచిది కాదు. లోపల ఏం జరుగుతుందో మనకి తెలియనప్పుడు సొంతంగా మెడిసిన్స్ తీసుకోకుడదు. మరీ ఇబ్బందిగా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు.

ఈ గొంతునొప్పి సాధారణంగా, పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు డాక్టర్స్ సూచించిన యాంటీబయాటిక్స్ పూర్తి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. సమస్య ఇతర భాగాలకు స్ప్రెడ్ అవుతుంది.

నిద్ర..

రెస్ట్ తీసుకోవాలి. పుష్కలంగా నిద్రపోవాలి. దీంతో మీ గొంతు కూడా హాయిగా ఫీల్ అవుతుంది. దీని వల్ల సమస్య చాలా వరకూ తగ్గే అవకాశం ఉంటుంది.

లిక్విడ్స్..

అదే విధంగా లిక్విడ్స్ తీసుకోవాలి. దీని వల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. డ్రింక్స్ అన్నాం కదా అని కాఫీ, టీ, ఆల్కహాల్ తీసుకోవద్దు. ఇవి సమస్యను మరింత పెద్దగా చేస్తాయి.

Also Read : Type 2 Diabetes : షుగర్ ఉన్నవారు ఈ వర్కౌట్స్ చేస్తే చాలా మంచిదట..

రిలీఫ్‌నిచ్చే ఫుడ్స్..

అదేంటి.. ఇలాంటి ఫుడ్స్ కూడా ఉంటాయా అనుకోవద్దు. కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు కడుపుతో మాటు గొంతు కూడా హాయిగా ఫీల్ అవుతుంది. అందులో వెచ్చని సూప్స్, కెఫీన్ లేని టీ, గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకోవడం మంచిది.

సూప్స్


పుక్కిలించడం..

ఉప్పునీటితో పుక్కించడం కూడా సమస్యను చాలా వరకూ తగ్గిస్తుంది. ఇందుకోసం పావు నుండి అర టిస్పూన్ ఉప్పుని ఓ టీ గ్లాసులో గోరువెచ్చని నీటితో కలిపి ఆ నీటితో పుక్కించండి. దీని వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది.

పొగకు దూరం…

కొంతమందికి సిగరెట్స్, పొగతాగే అలవాటు ఉంటుంది. ఈ సమయంలో వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. దీని ద్వారా గొంతు చికాకు నుంచి తప్పించుకోవచ్చు.

తులసి..

తులసి ఆకులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ సమయంలో తులసి ఆకులతో టీ పెట్టుకుని తాగొచ్చు. ఇందుకోసం నీటిలో తులసి ఆకులు, అల్లం వేసి మరిగించాలి. వడకట్టుకుని చల్లారక తేనె వేసుకుని తాగొచ్చు.

చన్నీరు..

స్నానం చేసేందుకు, తాగేందుకు చన్నీరు వద్దు. ఇది సమస్యను మరింతగా పెంచుతుంది

గోరువెచ్చని నీరు. .

తాగేందుకు గోరువెచ్చని నీరు వాడడం మంచిది. దీని వల్ల జీర్ణక్రియ కూడా మెరుగ్గా మారుతుంది.

హెర్బల్ టీ..

అంటే అల్లం, పసుపు, లెమన్ టీ.. ఇలా ఏవైనా చేసుకుని తాగొచ్చు. వీటిలో గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలిపి తాగాలి.

తేనె..

యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న తేనె తీసుకోవడం కూడా సమస్యను దూరం చేస్తుంది. గొంతునొప్పిని తగ్గిస్తుంది. అయితే పడుకునే ముందు ఓ టీ స్పూన్ తీసుకోవడం లేదా, ముందు చెప్పుకున్నట్లు హెర్బల్ టీలో కలిపి తాగడం మంచిది.

Also Read : Sleep Position : ఇలా పడుకుంటే వెన్నెముకకి అస్సలు మంచిది కాదట..
ఆవిరి..

ఆవిరి పట్టుకోవడం కూడా సమస్యను చాలా వరకూ దూరం చేస్తుంది. ఇందుకోసం మరిగే నీటిలో కొద్దిగా వాము, యూకలిప్టస్ ఆయిల్, లేదా పసుపు వేసి బాగా మరిగించి స్టీమ్ పట్టాలి.

అల్లం..

గోరువెచ్చని నీటిలో అల్లం, ఉప్పు, పసుపు వేసి పుక్కిలించాలి.

జంక్ ఫుడ్స్‌తో అనేక సమస్యలు

ఇవి చేయొద్దు..

ఇప్పటివరకూ ఏం తినాలి.. ఏం చేయాలో చూశాం.. ఇప్పుడు ఏం చేయకూడదో చూద్దాం.

  • కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు
  • పెరుగు.. ముఖ్యంగా పండ్లు, పెరుగు కలిపి అస్సలు తీసుకోవద్దు.
  • ఐస్‌క్రీమ్స్
  • షుగర్ ఫుడ్
  • ఫ్రైడ్ ఫుడ్
  • హెవీ ఫుడ్
  • మసాలా ఐటెమ్స్
  • మధ్యాహ్నం పడుకోవద్దు
  • అర్థరాత్రుల వరకూ మేల్కొని ఉండొద్దు.

Also Read : Bathing : చలికాలంలో స్ట్రోక్స్ రావడానికి ఇది కూడా ఓ కారణమే..

ఇవన్నీ చేశాక కూడా సమస్య తగ్గకపోతే ఓ సారి డాక్టర్‌ని కలిసి సలహా తీసుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *