PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Sperm count : వీటిని తింటే స్మెర్మ్ కౌంట్ పెరుగుతుందట..

[ad_1]

Sperm count : ఓ సాధారణ స్పెర్మ్ ఏకాగ్రత ప్రతి mL కి కనీసం 20 మిలియన్లు, అంతకంటే తక్కవ ఏదైనా పురుషుడి లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యని నివారించడనాకి, దాని కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లోని ఆండ్రాలజీ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ యూరాలజీ హెడ్ ఆఫ్ మెన్స్ హెల్త్ క్లినిక్ డాక్టర్ సంజయ్ పాండే చెప్పారు.

Also Read : Weight Loss : ఇలా చేస్తే అస్సలు బరువు పెరగరట..

వరికోసెల్ ఓ వేరికోసెల్ అనేది వృషణాన్ని హరించే సిరల వాపు, ఇది స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు కొన్ని అంటువ్యాధులు స్పెర్మ్ ఆరోగ్యం, ఉత్పత్తిని ప్రభావితం చేయొచ్చు. స్పెర్మ్ గుండా వెళ్ళకుండా నిరోధించే మచ్చలకు దారితీయొచ్చు. వీటిలో కొన్ని లైంగికంగా సంక్రమంచే అంటువ్యాధులు, హెచ్ఐవీ అలాగే వృషణాలకు, ఎపిడైమిస్ వాపు వంటివి ఉన్నాయి. హార్మోన్ల సమస్యలు థైరాయిడ్, అడ్రినల్ గ్రంధులలో హార్మోన్ల అసమతుల్యత, మార్పులు స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. స్కలన సమస్య రెట్రోగ్రేడ్ స్కలనం, స్కలనం లేకపోవడం, అంగస్తంభన లోపం వివిధ ఆరోగ్య సమస్యలు స్పెర్మ్ కౌంట్‌కి ఆటంకం కలిగిస్తాయి. జీవనశైలి కారకాలు, ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి అలవాట్లు స్పెర్మ్‌ నాణ్యత, పరిమాణంపై ప్రతికూలంగా జోక్యం చేసుకోవచ్చు. అదనంగా, ఊబకాయం, ఒత్తిడి, గాయం వంటి ఇతర లైఫ్‌స్టైల్ కారణంగా సంబంధం కలిగి ఉంటాయి.

ఫిట్‌నెస్ రొటీన్ రెగ్యులర్ వర్కౌట్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడం, సంతానోత్పత్తిని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంది. ఆల్కహాల్‌ని తగ్గించడం, ధూమపానం మానేయడం వంటివి బరువును కంట్రోల్ చేసే పనులు. స్పెర్మ్ కౌంట్, సంతానోత్పత్తిని పెంచుతాయి.

Also Read : Weight Loss : ఇలా చేస్తే అస్సలు బరువు పెరగరట..

పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తికి విటమిన్ డి నుండి ప్రయోజనం పొందొచ్చు. టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే మరో విటమిన్ ఇది. ఒక పరిశీలనా అధ్యయనం ప్రకారం, విటమిన్ డి లోపం ఉన్న పురుషులు తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలను కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 65 మంది టెస్టోస్టెరాన్ లోపం, విటమిన్ డి లోపం ఉన్న పురుషులు సహా నియంత్రిత పరిశోధన ద్వారా ఈ నిర్దారణలు ధృవీకరించబడ్డాయి. ఓ సంవత్సరం పాటు ప్రతిరోజూ 3000 ఐయూ విటమిన్ డి3 తీసుకున్న తర్వాత వారి టెస్టోస్టెరాన్ స్థాయిలు దాదాపు 25 శాతం పెరిగాయి. అధిక స్పెర్మ్ చలనశీలత అధిక విటమిన్ డి స్థాయిలతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే, దీనికి ప్రూఫ్స్ వ్యతిరేకంగా ఉన్నాయి.

విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ స్పెర్మ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని శాస్త్రీయంగా నిరూపించబడిన ఆహారాలలో ఒకటి. స్పెర్మ్ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా స్పెర్మ్ కాన్సంట్రేషన్ పెంపొందించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాల్లో తినడం క్లినికల్ పరిశోధనలో చూపబడింది.

Also Read : Relationship Tips : మా కజిన్ భార్య నన్ను అసహ్యించుకుంటోంది.. దీంతో కజిన్..

పురుషాంగం ఇంప్లాంట్ వంటి శస్త్రచికిత్సా విధానాలు కూడా ఉన్నాయి. దీనిలో ఓ జత ఫ్లెక్సిబుల్ సిలికాన్ సిలిండర్స్ పురుషాంగం అంగస్తంభన గదుల్లో శస్త్రచికిత్స ద్వారా ఉంచబడతాయి. ఇవి రోగికి మరింత మంచి అనుభూతిని, అనుభవాన్ని అందించే ఘనమైన మెల్లిబుల్ రాడ్స్, 3 ముక్కల గాలితో కూడిన ఇంప్లాంట్స్ కావొచ్చు. ఈ విధానాలు మనిషి అంగస్తంభన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి దారితీస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *