PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Startups: స్టార్టప్స్‌లోకి మందగించిన నిధుల ప్రవాహం.. యూనికార్న్స్‌లో బెంగళూరు టాప్


News

oi-Bogadi Adinarayana

|

Startup investments: గతేడాదికిగాను భారత్‌లోని స్టార్టప్‌లకు నిధుల ప్రవాహం 33 శాతం మేర తగ్గినట్లు.. ‘స్టార్టప్ ట్రాకర్-22’ పేరిట పీడబ్ల్యూసీ (PWC) విడుదల చేసిన నివేదిక చెబుతోంది. వెరసి 24 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ 2019, 2020లతో పోలిస్తే దాదాపు రెట్టింపయినట్లు పేర్కొంది.

అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఉన్నా.. దేశీయ స్టార్టప్ వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు సానుకూలంగా ఉన్నారని తెలిపింది. 2019లో 13.2, 2020లో 10.9, 2021లో 35.2 బిలియన్ డాలర్ల నిధులు స్టార్టప్‌లలోకి వచ్చినట్లు ప్రకటించింది.

Startups: స్టార్టప్స్‌లోకి మందగించిన నిధుల ప్రవాహం..

ఆశాదీపంగా సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ సర్వీస్…

సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ (SaaS) వంటి కొన్ని రంగాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. ప్రారంభంలో కొంతమేర నిధుల ప్రవాహం నెమ్మదించినా.. 2-3 త్రైమాసికాల తర్వాత సాధారణ స్థితికి చేరినట్లు ప్రకటించింది. అదే సమయంలో పలు స్టార్టప్‌లు తెలివిగా.. పని నిబంధనలు కఠినతరం చేయడం, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం, పెట్టుబడులు వాయిదా వేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం మంచి ఫలితాలను ఇచ్చినట్లు పేర్కొంది.

2021-2022 పరంగా మొత్తం ఫండింగ్‌లో ప్రారంభ దశ డీల్స్ 60-62 శాతం ఉండగా.. సగటు ఒక్కో డీల్‌ 4 మిలియన్ డాలర్లని తెలిపింది. తద్వారా 2021లో దాదాపు 7 శాతం నమోదు కాగా.. 2022లో 12 శాతం వరకు పెరగడానికి దోహదపడ్డాయంది. చివరి దశ ఒప్పందాల విషయానికి వస్తే 2022లో 88 శాతం కార్యరూపం దాల్చాయన్నారు.

Startups: స్టార్టప్స్‌లోకి మందగించిన నిధుల ప్రవాహం..

యూనికార్న్‌ల స్వర్గధామం బెంగళూరు:

నగరాల వారీగా స్టార్టప్ ఫండింగ్‌కు సంబంధించి.. డిసెంబర్ 2022 నాటికి బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్‌, ముంబైలు దాదాపు 82 శాతం వాటా కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. టాప్ 3 నగరాల్లోనే 28 శాతం స్టార్టప్‌లు అధికంగా నిధులు రాబట్టాయని తెలిపింది. వీటి విలువ 20 మిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. అత్యధిక సంఖ్యలో యూనికార్న్‌లు (బిలియన్ డాలర్ల వాల్యూ కలిగిన స్టార్టప్‌లు) బెంగళూరులో కనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఎన్‌సీఆర్‌, ముంబై ఉన్నాయి. 50-100 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసిన ఇతర కంపెనీల్లోనూ ఇదే తరహా ప్రవాహం కనిపించినట్లు తేల్చింది.

English summary

PWC report on Investments decline into Indian starups

Investments declines into Indian startups..

Story first published: Saturday, January 14, 2023, 7:56 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *