వేలాదిగా హాజరు:

నిష్ణాతులైన 150కి పైగా ప్రఖ్యాత ఉపన్యాసకులతో సహా మొత్తం 2 వేలకుపైగా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. భారత స్టార్టప్ ఎకోసిస్టం తాజా పోకడలు, ఆవిష్కరణలు, ఎదుర్కొంటున్న సవాళ్లపై ఇందులో చర్చించనున్నారు. గత 13 ఏళ్లుగా సాంకేతిక ఆవిష్కరణలకు TechSparks డెస్టినేషన్ గా మారింది. పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, పలువురు వాటాదారుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఆవిష్కరణలకు గమ్యస్థానంగా..

ఆవిష్కరణలకు గమ్యస్థానంగా..

ఇప్పటివరకు 2 బిలియన్ డాలర్ల మూలధనాన్ని TechSparks ద్వారా సమీకరించగలిగారు. అభివృద్ధి చెందుతున్న, అత్యాధునిక సాంకేతికతల ఆవిష్కరణలకు ఇది గమ్యస్థానంగా పేరుగాంచింది. దేశీయంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నెలకొల్పిన విజయవంతమైన కంపెనీల ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం లభిస్తోంది. ఆరోగ్యకరమైన, అర్థవంతమైన మార్గంలో నిపుణులతో కనెక్ట్ కావడానికి దీనిని ఓ మార్గంగా చెప్పవచ్చు.

మొదటి డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్:

మొదటి డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్:

2008లో స్థాపించబడిన ‘యువర్‌ స్టోరీ’.. భారతదేశంలోని మొదటి డిజిటల్ మీడియా ప్లాట్‌ ఫారమ్. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీల వ్యవస్థాపకులు, విధాన రూపకర్తల సానుకూల కథనాలను ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటుంది.ఇప్పటి వరకు 150 వేల ఉత్సాహపూర్వక కథనాలను అందిస్తూ.. 12 భారతీయ భాషల్లోకి విస్తరించింది.ఈ నెలలో ముంబైలో జరగునున్న TechSparks ఈవెంట్లో పాల్గొనేందుకు https://yourstory.com/techsparks-mumbai2023/registration ద్వారా ఉత్సాహవంతులు నమోదు చేసుకోవచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *