[ad_1]
News
oi-Mamidi Ayyappa
Stock Market: నిన్న భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు తేరుకున్నాయి. ఆరంభంలో సెన్సెక్స్ సూచీ 200 పాయింట్ల లాభంతో మెుదలైంది. ఈ క్రమంలో దాదాపుగా అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్ రంగాలు మార్కెట్ల పురోగతికి ఆధారంగా నిలిచాయి. అయితే మార్కెట్లు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే లాభాలు ఆవిరయ్యాయి.
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో హై ఓలటాలిటీ కొనసాగుతోంది. ఉదయం 9.50 నిమిషాలకు బెంచ్ మార్క్ సూచీ 67 పాయింట్లు, నిఫ్టీ సూచీ 15 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 136 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో డాబర్ కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలలో 1 శాతాన్ని బల్క్ డీల్ ద్వారా విక్రయించినట్లు తేలింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షేర్లు బైబ్యాక్ రూల్స్ విషయంలో మార్పులు చేస్తోంది.
హెచ్సీఎల్, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, ఏషియా పెయింట్స్, ఎస్బీఐతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
బ్రిటానియా, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్డీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, ఐటీసీ, రిలయన్స్, సిప్లా, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, టాటా మోటార్స్, మారుతీ, టాటా కన్జూమర్, బజాజ్ ఫిన్ సర్వ్ తో సహా మరిన్ని స్టాక్స్ ఎన్ఎస్ఈ సూచీలో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
English summary
indian stock markets in high volatality after starting in profits
indian stock markets in high volatality after starting in profits
Story first published: Wednesday, December 21, 2022, 10:26 [IST]
[ad_2]
Source link