Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా

[ad_1]

మార్కెట్ సూచీలు..

మార్కెట్ సూచీలు..

ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 510 పాయింట్లు, నిఫ్టీ సూచీ 136 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 761 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 234 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. పైగా ఈ రోజు మార్కెట్లోకి అదానీ గ్రూప్ తీసుకొస్తున్న అతిపెద్ద ఎఫ్పీవో ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. దీని ద్వారా కంపెనీ దాదాపు రూ.20,000 కోట్లను సేకరిస్తోంది.

పెద్ద ఊరట..

పెద్ద ఊరట..

ప్రపంచ మార్కెట్లు ఎప్పుడూ అమెరికా ఆర్థిక పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచుతాయి. ఈ క్రమంలో వచ్చే వారం యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశం కూడా ఉంది. ఈ క్రమంలో నాల్గవ త్రైమాసికంలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ విశ్లేషకులు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉందని, డిమాండ్ తగ్గుతున్న కొన్ని సంకేతాలు ఉన్నప్పటికీ లేబర్ మార్కెట్ గట్టిగానే ఉందని డేటా వెల్లడించింది. జీడీపీ డేటా సైతం మాంద్యం భయాలను తగ్గిస్తూ ఊరటను కల్పిస్తోంది. దీంతో అమెరికా మార్కెట్ సూచీలు లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్..

టాప్ గెయినర్స్..

టాటా మోటార్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్, టాటా స్టీల్, యూపీఎల్, అట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, మారుతీ, హెచ్సీఎల్ లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

 టాప్ లూజర్స్..

టాప్ లూజర్స్..

ఎన్ఎస్ఈ సూచీలోని ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, భారతీ ఎయిర్ టెల్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రాతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *