News
oi-Chekkilla Srinivas
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. శక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 59,808 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 272 పాయింట్లు వృద్ధి చెంది 17,594 వద్ద స్థిరపడింది. అదానీ గ్రూప్ స్టాక్ ల్లో ర్యాలీ సాగింది. యుఎస్ ఆధారిత జిక్యూజి అదానీ కంపెనీల్లో
రూ.15,446 కోట్ల పెట్టుబడులు పెట్టిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్‌లో కదలిక ఏర్పడింది. అదానీ ఎంటర్ ప్రైసెస్ రూ.266 పెరిగి రూ.1874 వద్ద స్థిరపడింది. దాదాపు 16 శాతం పెరిగింది. అదానీ గ్రీన్ 26 పాయింట్లు పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది.
అదానీ విల్మార్ స్టాక్ దాదాపు 5 శాతం పెరిగి అప్పర్ సర్య్సూట్ లో లాక్ అయింది. అదానీ పోర్ట్స్ రూ.60 పెరిగి 683 వద్ద స్థిర పడింది. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బిఐ, భారతీ ఎయిర్‌టెల్ మరియు ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ గెయినర్స్ కాగా, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5.4 శాతం, మెటల్ 3.5 శాతం, బ్యాంక్ 2 శాతం లాభపడడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి.

సెన్సెక్స్-30 ఇండెక్స్ లో ఎస్బీఐఎన్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, ఐటీసీ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటా మోటర్స్, ఐసీఐసీఐ బ్యాంకు, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సీ, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, హెచ్సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, హిందూస్థాన్ యూనిలివర్, టీసీఎస్, విప్రో, మారుతి, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా లాభాల్లో ముగిశాయి. ఏసియన్ పేయింట్స్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా నష్టాల్లో ముగిశాయి.
English summary
Stock markets ended Friday with huge gains
Stock markets ended with huge gains. The BSE Sensex rose 899 points to close at 59,808 points on Friday. The NSE Nifty rose 272 points to settle at 17,594.
Story first published: Friday, March 3, 2023, 16:40 [IST]