Stock Market: మూన్నాళ్ల ముచ్చటైన లాభాలు.. 636 పాయింట్లు ఆవిరి.. ఫెడ్ మీటింగ్ భయాలు..

[ad_1]

సూచీల నేల చూపులు..

సూచీల నేల చూపులు..

ఉదయం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ర్యాలీని కొనసాగించాయి. ఈ క్రమంలో చివరికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 636 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ 190 పాయింట్లు నష్టపోయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 466 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 357 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. దీంతో కొత్త సంవత్సరం లాభాలు మూడునాళ్ల ముచ్చటలా మారాయి.

అమెరికా మార్కెట్లు..

అమెరికా మార్కెట్లు..

అమెరికా వాల్ స్ట్రీట్ 2023లో మంగళవారం తొలి ట్రేడింగ్ సెషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో నాస్‌డాక్ 0.76 శాతం క్షీణించగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.03 శాతం, S&P 500 సూచీ 0.4 శాతం క్షీణించాయి. 11 ప్రధాన S&P సెక్టార్‌లలో ఆరు నష్టాల్లో ముగిశాయి. ఇటీవల ఐఎంఎఫ్ చీఫ్ సైతం 2023 కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ సమయంలో ముడి చమురు సైతం బ్యారెల్ కు 80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

టాప్ గెయినర్స్..

టాప్ గెయినర్స్..

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ ముగింపు సమయానికి దివీస్ ల్యాబ్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..

టాప్ లూజర్స్..

ఇక ఇదే సమయంలో ఎన్ఎస్ఈ సూచీలోని జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, ఎస్బీఐ షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *