మార్కెట్ సూచీలు..
ఉదయం 9.56 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 239 పాయింట్లు, నిఫ్టీ సూచీ 49 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 111 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 30 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. మార్కెట్లలో ఓలటాలిటీ కారణంగా సూచీలు స్వల్ప కదలికలతో ట్రేడవుతున్నాయి.

US ఫెడ్ వడ్డీ రేటును పెంచవచ్చు
ద్రవ్యోల్బణాన్ని విజయవంతంగా తగ్గించేందుకు వడ్డీ రేట్లను మళ్లీ పెంచాల్సిన అవసరం ఉందని ఇద్దరు ఫెడరల్ రిజర్వ్ అధికారులు సూచించారు. కొత్త ఏడాది వడ్డీ రేట్ల పెంపులో దూకుడు తగ్గుతుందని ఆర్థిక నిపుణులు భావించినప్పటికీ అది ఇంకా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అయితే పరిస్థితులు కొంత మెరుగు పడటంతో చివరి సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలివర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టి, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐషర్ మోటాక్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
సూచీలోని సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, నెస్లే, యూపీఎల్, హీరో మోటార్స్, టాటా స్టీల్, బ్రిటానియా, గ్రాసిమ్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.