మార్కెట్ సూచీలు..

దేశీయ మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 337 పాయింట్ల నష్టాలను నమోదు చేయగా.. నిఫ్టీ సూచీ 111 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 153 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 157 పాయింట్లను కోల్పోయాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, మెటల్, ఐటీ రంగాలకు చెందిన షేర్లు నష్టాలను చవిచూశాయి.

మార్కెట్లకు ఏమైంది..?

మార్కెట్లకు ఏమైంది..?

ఈరోజు మార్కెట్లలోని తగ్గుదల గత 5 నెలల రికార్డును బద్దలు కొట్టింది. యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిన నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో స్టాక్‌ల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇది దేశీయ మార్కెట్లలో భారీ క్షీణతకు దారితీసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి.

 టాప్ గెయినర్స్..

టాప్ గెయినర్స్..

మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ సూచీలోని టైటాన్, బీపీసీఎల్, ఎల్ టి, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కొ, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..

టాప్ లూజర్స్..

మార్కెట్ క్లోజింగ్ సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఐటీసీ, ఎస్బీఐ, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ముగిసి టాప్ లూజర్స్ గా నిలిచాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *