News
lekhaka-Bhusarapu Pavani
Stock
Markets:
ఉదయం
నష్టాల్లోకి
జారుకున్న
స్టాక్
మార్కెట్లు
తిరిగి
లాభాల
బాట
పట్టాయి.
ఫ్లాట్
ప్రారంభం
తర్వాత
చాలా
సేపు
స్థబ్ధుగా
కొనసాగాయి.
అయితే
రియల్టీ,
క్యాపిటల్
గూడ్స్
రంగాల్లో
జోరుతో
లాభపడ్డాయి.
సాయంత్రం
మార్కెట్లు
ముగిసే
సమయానికి
బెంచ్
మార్క్
సూచీ
సెన్సెక్స్
170
పాయింట్లు
లాభంలో
ఉండగా..
నిఫ్టీ
సూచీ
44
పాయింట్ల
మేర
లాభపడింది.
ఇదే
సమయంలో
నిఫ్టీ
బ్యాంక్
సూచీ
151
పాయింట్లు
లాభపడగా..
నిఫ్టీ
మిడ్
క్యాప్
సూచీ
మాత్రం
48
పాయింట్ల
మేర
లాభపడింది.

మారుతీ
సుజుకీ
తన
క్యూ-4
ఫలితాలను
విడుదల
చేయటం
ఆ
రంగంలో
ప్రాధాన్యం
సంతరించుకుంది.
ఆటో
దిగ్గజం
లాభాలు
43
శాతం
పెరిగి
రూ.2,623
కోట్లుగా
నిలిచాయి.
ఈ
క్రమంలో
కంపెనీ
త్రైమాసికంలో
5,14,927
వాహనాలను
విక్రయించి.
గత
త్రైమాసికం
ఇదే
సమయంతో
పోల్చితే
అమ్మకాలు
5.3
శాతం
మేర
పెరిగాయి.
అయితే
త్వరలో
విప్రో
ఫలితాలు
మార్కెట్లోకి
వస్తున్న
తరుణంలో
ఆదాయ
వృద్ధి
13
శాతంగా
ఉండవచ్చని
మార్కెట్
వర్గాలు
అంచనా
వేస్తున్నాయి.
NSE
సూచీలో
పవర్
గ్రిడ్,
టాటా
కన్జూమర్,
నెస్లే,
ఇండస్
ఇండ్
బ్యాంక్,
ఎస్టీఐ
లైఫ్,
ఎల్
టి,
హెచ్సీఎల్
టెక్,
హిందుస్థాన్
యూనిలివర్,
ఎస్బీఐ,
యాక్సిస్
బ్యాంక్,
టాటా
మోటార్స్,
ఐషర్
మోటార్స్,
హెచ్డీఎఫ్సీ
బ్యాంక్,
టీసీఎస్,
మహీంద్రా
అండ్
మహీంద్రా,
గ్రాసిమ్,
హీరో
మోటార్స్,
ఏషియన్
పెయింట్స్,
బీపీసీఎల్,
సిప్లా
కంపెనీల
షేర్లు
లాభాల్లో
ముగిసి
టాప్
గెయినర్స్‌గా
నిలిచాయి.
ఇదే
క్రమంలో
సూచీలోని
హిందాల్కొ,
అదానీ
పోర్ట్స్,
బజాజ్
ఆటో,
బజాజ్
ఫిన్
సర్వ్,
ఎన్టీపీసీ,
రిలయన్స్,
దివీస్
ల్యాబ్స్,
బజాజ్
ఫైనాన్స్,
కోటక్
బ్యాంక్,
జేఎస్డబ్ల్యూ
స్టీల్,
అపోలో
హాస్పిటల్స్,
కోల్
ఇండియా,
టాటా
స్టీల్,
విప్రో,
టెక్
మహీంద్రా,
బ్రిటానియా,
సన్
ఫార్మా
కంపెనీల
షేర్లు
నష్టాల్లో
ముగిసి
టాప్
లూజర్స్‌గా
నిలిచాయి.
English summary
Indian market indices sensex, nifty closed in gains, Maruti suzuli posted q4 results
Indian market indices sensex, nifty closed in gains, Maruti suzuki posted q4 results