News

lekhaka-Bhusarapu Pavani

|

Sudha Murthy: నాలుగు రూపాయలు సంపాదించగానే కళ్లు నెత్తికెక్కే జనానికి ఈ రోజుల్లో కొదవే లేదు. అయితే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి మాత్రం ఇలాంటి టెక్కులు పోయే వారికి చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడు ఎలాంటి సందర్భలోనైనా తన సింప్లిసిటీని అలాగే కొనసాగిస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. ప్రభుత్వం నుంచి ప్రఖ్యాత పద్మశ్రీ, పద్మ భూషన్ వంటి అవార్డులను అందుకున్నప్పటికీ అదే స్వభావాన్ని కొనసాగిస్తున్నారు.

తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో మంగళవారం జరిగిన ప్రసిద్ధ పొంగళ పండుగకు వేలాది మంది మహిళలు తరలి వెళ్లి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో సుధా మూర్తి గుడి దగ్గర నేలపై కూర్చొని మండుతున్న ఎండలో దేవుడికి ఎంతో ఇష్టంగా, సంతోషంతో నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sudha Murthy: కోట్లకు పడగలెత్తినప్పటికీ అదే సింప్లిసిటీ..

ఈ క్రమంలో సుధా మూర్తి దగ్గర కూర్చున్న ఒక సామాన్య స్త్రీ మీ భర్త ఏం చేస్తారంటూ అడిగారు. దీనికి బదులిచ్చిన సుధా మూర్తి ఆయన ఒక సంస్థను నడుపుతున్నారని బదులిచ్చారు. అలా మాటల్లో కుటుంబం గురించి ప్రశ్నించగా యూకేలో అల్లుడు ఏం చేస్తారని ప్రశించింది సదరు మహిళ. తన అల్లుడు కూడా రాజకీయాల్లో ఉన్నాడని, ఇప్పుడు పంచాయతీ సభ్యుడిగా ఉన్నాడని ఆ మహిళకు సమాధానం ఇచ్చింది.

Sudha Murthy: కోట్లకు పడగలెత్తినప్పటికీ అదే సింప్లిసిటీ..

ఇదే క్రమంలో సుధా మూర్తిని గుర్తించిన కొద్దిమందిలో ప్రముఖ మలయాళ నటి చిప్పీ రంజిత్ కూడా ఉన్నారు. ఆమె తన సోషల్ మీడియా పేజీలో మూర్తితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. జీవితంలోని వివిధ రంగాల్లో రాణిస్తున్న ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని మనం కలుసుకోవడం ప్రతిరోజూ కుదరదంటూ ఒక పోస్ట్ చేశారు. అయితే ఆలయ ఉత్సవాలకు అత్యధికంగా మహిళలు తరలివచ్చే అట్టుకల్ పొంగళ పండుగకు తాను రావడం ఇదే తొలిసారి అని మూర్తి మీడియాకు తెలిపారు.

English summary

Sudha Murthy Pics offering pongala at Attukal Bhagavathy Temple in Thiruvananthapuram going viral

Sudha Murthy Pics offering pongala at Attukal Bhagavathy Temple in Thiruvananthapuram going viral

Story first published: Sunday, March 12, 2023, 18:50 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *