ఆ ముగ్గురు ఎవరంటే ?
బ్రిటీష్ జాతీయుడు, ప్రముఖ వ్యాపారి కరణ్ సంజ్నావి, ఓ సెలబ్రిటీ మేనేజర్ రహీలా ఫిర్నిచర్ వాలా, జగదీష్ సింగ్ ఆనంద్ అనే ముగ్గురిని ఇప్పుడు ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టు అయిన ముగ్గురిని డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉండటమే కాకుండా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసుతో వీరికి లింక్ ఉందని ఆరోపణలు ఉన్నాయి.

ఇంతకు ముందే అరెస్టు….. ఇప్పుడు మళ్లీ సేమ్ సీన్
ఓ కేసుకు సంబంధించి కరణ్ సంజ్నాని, రహీలా ఫర్నిచర్ వాలాను గత నెలలోనే అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కరణ్ సంజ్నాని, రహీలా ఫర్నిచర్ వాలా రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. ముంబాయి డ్రగ్స్ మాఫియా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుతో వీరికి సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఎన్ సీబీ అధికారులు అరెస్టు చెయ్యడంతో వారి సన్నిహితులు హడలిపోయారు.

వీళ్లు బ్రదర్స్… వన్ బై వన్
ఎన్ సీబీ అధికారులు ఇప్పుడు అరెస్టు చేసిన మూడో వ్యక్తి జగదీప్ సింగ్ కు చిన్న చరిత్ర ఉంది. ఇంతకు ముందు అరెస్టు అయిన కరమ్ జిత్ సింగ్ సోదరుడే ఈ జగదీప్ సింగ్. డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉన్న జగదీప్ సింగ్ తో ఇప్పుడు అరెస్టు అయిన రహీలా ఫర్నిచర్ వాలా, కరణ్ జాహ్ననికి లింక్ లు ఉన్నాయని, వీరి మద్య చాలా మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఎన్ సీబీ అధికారులు గుర్తించారు.

సుశాంత్ సింగ్ కేసు కీలకం ?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ కేసు సీబీఐ అధికారుల నత్తనడకన దర్యాప్తు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల ఓ న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఇప్పటి వరకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, డ్రగ్స్ కేసుకు సంబంధించి 33 మందిని అధికారులు అరెస్టు చేశారు.

హీరో మాజీ లవర్ నుంచి అందరూ అందర్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన 33 మందిలో కొందరికి బెయిల్ రావడంతో వారు జైలు నుంచి బయటకు వచ్చారు. బెయిల్ రాని కొందరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపి తరువాత షరతులతో బెయిల్ మీద బయటకు వచ్చారు. సుశాంత్ సింగ్, డ్రగ్స్ మాఫియా కేసులో ఇంకా ఎంతమంది అరెస్టు అవుతారో ? అనే విషయం అంతు చిక్కడం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.