ఇప్పటికే సంతకాలు పూర్తి
HSBC బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ UK సిబ్బందికి 18 మిలియన్ల బోనస్ లభించనుంది. SVBకి సంబంధించిన బ్రిటన్ విభాగాన్ని 1 పౌండ్(దాదాపు రూ.100) వెచ్చించి HSBC దక్కించుకోవడం తెలిసిందే. తద్వారా ఈ కొనుగోలు ఒప్పందం, సిబ్బంది బోనస్ పై ఇప్పటికే సంతకాలు జరిగినట్లు తెలుస్తోంది.

స్థిరత్వం కోసం HSBC ప్రయత్నాలు
ఈ డీల్ అనంతరం వినియోగదారులను కాపాడటానికి HSBC ప్రయత్నాలు ప్రారంభించింది. 2 బిలియన్ డాలర్ల నిధులను హామీగా ఉంచాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా రుణదాతలను ఆకర్షించి, బ్యాంకింగ్ రంగంలో స్థిరత్వం నెలకొల్పడానికి చూస్తోంది. మాతృ సంస్థ SVB US నుంచి UK విభాగాన్ని ఈ చర్యలు వేరు చేయనున్నాయి.

US ఉద్యోగుల మాటేమిటి ?
చాప్టర్ 11 ప్రకారం దివాలా కింద పునర్నిర్మాణం జరిగిన తర్వాత రుణదాతలకు అప్పులు తిరిగి చెల్లించడానికి కొంత సమయం దొరుకుతుంది. ఈ విధంగా 2.1 బిలియన్ డాలర్లను చొప్పించి.. విదేశీ కరెన్సీ ఖాతాలు కలిగిన భారతీయ స్టార్టప్లకు HSBC భరోసా కల్పించింది.
SVB UKలోని సిబ్బంది బోనస్ లు పొందుతుండటంతో.. USలోని ఉద్యోగులకు 45 పనిదినాలకుగాను 1.5 రెట్లు జీతాన్ని అందుకోనున్నారు. మొత్తానికి SVB పతనం, దాని ఉద్యోగులకు వరంగా మారిందన్న మాట.