News
lekhaka-Bhusarapu Pavani
Swiggy:
ఆన్
లైన్
ఫుడ్
అగ్రిగేటర్
గా
స్విగ్గీకి
మంచి
పేరుంది.
కానీ
కంపెనీ
మాత్రం
ఒడిదుడుకులను
ఎదుర్కొంటోంది.
ప్రముఖ
ఇన్వెస్ట్
మెంట్
మేనేజ్మెంట్
సంస్థ
ఇన్వెస్కో
ఏడాదిలో
రెండోసారి
స్విగ్గీ
వాల్యుయేషన్
ను
తగ్గించింది.
US
సెక్యూరిటీ
అండ్
ఎక్స్ఛేంజ్
కమీషన్
(SEC)
రెగ్యులేటరీ
ఫైలింగ్స్
ప్రకారం..
జనవరి
2022లో
10.7
బిలియన్
డాలర్లుగా
పేర్కొనగా,
ఇప్పుడు
దానిని
కాస్తా
దాదాపు
5.5
బిలియన్లకు
అంటే
దాదాపు
సగానికి
తగ్గించింది.
జనవరి
31,
2023
నాటికి
స్విగ్గీ
షేర్‌లను
3,305
డాలర్లుగా
ఇన్వెస్కో
విలువ
కట్టింది.
గతేడాది
అక్టోబర్
లో
ఇది
4,759గా
నిర్ణయించింది.
ఒక్క
ఏప్రిల్‌లోనే
కంపెనీ
వాల్యూని
10.7
బిలియన్ల
నుంచి
8.2
బిలియన్
డాలర్లకు
తగ్గించింది.
ఈ
నెల
ప్రారంభంలో
దీనిపై
స్పందించిన
స్విగ్గీ,
ఇన్వెస్కో
వాల్యుయేషన్
ను
ఖండించింది.

వచ్చే
ఏడాది
తన
IPOను
లాంచ్
చేయడం
కోసం
స్విగ్గీ
తీవ్రంగా
కృషి
చేస్తోంది.
కాగా
ఈ
నెలలో
తన
కోర్
ఫుడ్
డెలివరీ
వ్యాపారాన్ని
లాభదాయకంగా
మార్చాలని
లక్ష్యంగా
పెట్టుకుంది.
ఇందులో
భాగంగా
తన
వాల్యుయేషన్
ను
జనవరి
2022లో
10
బిలియన్
డాలర్లకు
పెంచుకుంది.
అయితే
జూలై
2021లో
దాని
ప్రత్యర్థి
జొమాటో
12
బిలియన్
డాలర్ల
విలువతో
IPOకి
వెళ్లిన
విషయం
తెలిసిందే.
అనంతరం
గడిచిన
21
నెలల్లో
దాని
మార్కెట్
క్యాప్
లో
45
శాతాన్ని
కోల్పోయింది.

FY22లో
స్విగ్గీ
స్థూల
ఆదాయం
(GMV)
2.2
రెట్లు
పెరిగి
5
వేల
705
కోట్ల
రూపాయలకు
చేరుకుంది.
దాని
నష్టాలు
సైతం
అదే
స్థాయిలో
2.2
రెట్లతో
3
వేల
629
కోట్లకు
పెరిగాయి.
FY23
మొదటి
అర్ధ
భాగంలో
కంపెనీ
రెస్టారెంట్
ఫుడ్
డెలివరీ
GMV
1.3
బిలియన్లుగా
ఉంది.
కంపెనీ
ప్రారంభ
మద్దతుదారు
ప్రోసస్
ఈ
మేరకు
నివేదికను
ప్రచురించింది.
సంస్థ
తన
FY23
గణాంకాలను
ఫైల్
చేయాల్సి
ఉంది.
English summary
Invesco cuts Swiggy’s valuation second time in a year
Invesco cuts Swiggy’s valuation second time in a year
Story first published: Tuesday, May 9, 2023, 8:08 [IST]