ధరల యుద్ధానికి ముగింపు:

గతేడాది సెప్టెంబరు నుంచి తమ ధోరణిని మార్చుకున్నట్లు టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ తెలిపారు. వినియోగదారులు, ఫైనాన్షియర్లు, భాగస్వాములతో అనేక పర్యాయాలు చర్చించిన తర్వాతే.. ధరల విషయంలో నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. వాణిజ్య వాహనాల మార్కెట్‌ లో అగ్రస్థానం పొందేందుకుగాను.. ధరల తగ్గింపు విధానాన్ని అనుసరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రత్యర్థి కంపెనీ అశోక్ లేలాండ్ మాత్రం డిస్కౌంట్లను కొనసాగించింది.

 మార్జిన్‌ లపై నియంత్రణ:

మార్జిన్‌ లపై నియంత్రణ:

ఏడాదికి పైగా తమ సంస్థ ఉత్పత్తులపై డిస్కౌంట్లు స్థిరంగా తగ్గినట్లు అశోక్ లేలాండ్ భారీ వాహనాలే బిజినెస్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. ఫలితంగా మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. గతేడాది మొదటి ఆరు నెలల్లో వస్తువుల ధరలు పెరిగినా.. మార్జిన్‌లపై మెరుగైన నియంత్రణ కలిగి ఉండటంతో అంతగా ప్రభావం చూపలేదన్నారు.

సింగిల్ డిజిట్ కే పరిమితం:

సింగిల్ డిజిట్ కే పరిమితం:

కమర్షియల్ వెహికల్స్ పరిశ్రమ ఈ ఏడాది చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధిని నమోదు చేయలేదని అంచనాలు వెలువడుతున్నాయి. 2023-24లో ఆటోమోటివ్ విభాగం వృద్ధి.. కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే ఉంటుందని ప్రముఖ రేటింగ్ సంస్ ఇక్రా నివేదించింది. 2024కి గాను ప్యాసింజర్ వాహనాల, వాణిజ్య వాహనాల, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల డిమాండ్ కేవలం 4 నుంచి 10 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. 2023లో రెండంకెల వృద్ధి ఉంటుందని అభిప్రాయపడింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *