మెగా కార్ల ఆర్డర్..

రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌ ఉబెర్‌తో టాటా గ్రూప్ అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం టాటా మోటార్స్ రానున్న కాలంలో 25,000 ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా రవాణా రంగంలో వస్తున్న అతిపెద్ద మార్పును టాటా మోటార్స్ అందిపుచ్చుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.

పైగా కంపెనీ ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీసింగ్, మరమ్మత్తు, నిర్వహణ వంటి ఈవీ మౌలిక సౌకర్యాలను వేగంగా విస్తరించటం కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.

హైదరాబాద్ నగరం..

హైదరాబాద్ నగరం..

దేశంలోని ప్రధాన నగరాల్లో ఉబైర్ టాటాలకు చెందిన దీర్ఘ-శ్రేణి Xpres-T మోడల్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం ఈ మోడల్ కార్లపై అద్భుతమైన ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తోంది. ఈ మోడల్ కార్లను టాటా మోటార్స్ రానున్న కాలంలో దశలవారీగా డెలివరీ చేయనుంది. దీంతో ఢిల్లీ-NCR, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ఇది రోడ్డెక్కనున్నట్లు ఉబెర్ వెల్లడించింది.

టాటాల ఆధిపత్యం..

టాటాల ఆధిపత్యం..

ఉబెర్ ఒప్పందం EV ప్యాసింజర్ వెహికల్ కేటగిరీలో టాటా మోటార్స్ ఆధిపత్య మార్కెట్ వాటాను కార్నర్ చేయడానికి దోహదపడుతోంది. రైడ్-హెయిలింగ్ కంపెనీలు EVలను స్వీకరించడం టాటా మోటార్స్ కు భారీగా కలిసొస్తోంది. కంపెనీలు సైతం మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా గ్రీన్ అండ్ క్లీన్ మెుబిలిటీ సొల్యూషన్స్ వైపు మళ్లటం ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈవీ వాహనాలకు ఉండే సమస్యలను పరిష్కరిస్తూ టాటాలు ఎకోసిస్టమ్ రూపొందించటం ప్రస్తుతం వ్యాపార వృద్ధికి కలిసొస్తోందని తెలుస్తోంది.

 స్టాక్ పరుగులు..

స్టాక్ పరుగులు..

ఉబెర్ కంపెనీ నుంచి భారీ ఆర్డడ్ పొందిన క్రమంలో టాటా మోటార్స్ స్టాక్ ఇటీవల మంచి ర్యాలీని నమోదు చేసింది. క్రితం ట్రేడింగ్ సెషన్ ముగింపు సమయంలో స్టాక్ ఎన్ఎస్ఈలో రూ.436.80 వద్ద ట్రేడింగ్ ముగించింది. ప్రస్తుతం స్టాక్ తన 52 వారాల గరిష్ఠమైన రూ.494.40 రేటుకు చేరువలో ట్రేడింగ్ జరుగుతోంది. దీనికి తోడు దీని సబ్సిడరీ కంపెనీ టాటా టెక్నాలజీస్ మార్కెట్లోకి ఐపీవోగా వస్తున్న తరుణంలో స్టాక్ మంచి పనితీరును కనబరుస్తోంది. ఇన్వెస్టర్లు సైతం కంపెనీ షేర్లపై పాజిటివ్ గా ఉన్నారు.

2040 నాటికి జీరో-ఎమిషన్ వెహికల్స్‌లో, పబ్లిక్ ట్రాన్సిట్‌లో లేదా మైక్రో-మొబిలిటీతో 100% రైడ్‌లు జరిగేలా చూసుకోవడానికి Uber తన నిబద్ధతను నెరవేర్చడంలో కూడా ఇది సహాయపడుతుంది .



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *