PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Tata Motors: దేశంలో తొలి వెహికల్ స్క్రాప్ ప్లాంట్ ప్రారంభించిన టాటాలు..! పూర్తి వివరాలు


భాగస్వామి సాయంతో..

టాటా మోటార్స్ దీనిని భాగస్వామి గంగానగర్ వాహన్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేసి, నిర్వహిస్తోంది. ఏడాదికి 15,000 వాహనాలను స్క్రాప్ చేసేందుకు వీలుగా దీనిని సిద్ధం చేశారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. కాలుష్యాన్ని కలిగిస్తున్న వాహనాలను దశలవారీగా నిర్మూలించేందుకు, కర్భన ఉద్ఘారాలను సాధించేందుకు, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇంధన సామర్థ్యం కలిగిన గ్రీన్ వాహనాల వినియోగం దిశగా దేశం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

వాహన్ స్క్రాపింగ్ హబ్..

భారతదేశాన్ని మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో వాహన స్క్రాపింగ్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. దేశంలో ఇలాంటి అత్యాధునిక స్క్రాపింగ్ అండ్ రీసైక్లింగ్ యూనిట్లు మరిన్ని అవసరమని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తాజాగా టాటాలు అందుబాటులోకి తీసుకొచ్చిన ప్లాంట్ జీవితకాలం ముగిసిన వాహనాలను సురక్షితమైన, స్థిరమైన ఉపసంహరణ కోసం ప్రపంచ స్థాయి పర్యావరణ అనుకూల ప్రక్రియలను ఉపయోగిస్తుంది.

ప్లాంట్ ప్రత్యేకతలు ఇవే..

టాటాలు అందుబాటులోకి తెచ్చిన Re.Wi.Re సౌకర్యం పూర్తిగా డిజిటల్, పేపర్‌లెస్. ఇందులో టైర్లు, బ్యాటరీలు, గ్యాసోలిన్, ఇంజిన్ ఆయిల్స్, గ్యాసెస్ వంటి భాగాలను సురక్షితంగా విచ్ఛిన్నం చేయడానికి నిర్దిష్ట స్టేషన్‌లు ఉన్నాయి. ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల కోసం SOP ప్రకారం వాహనాలు స్క్రాప్ చేయడానికి ముందు సమగ్రమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియకు లోబడి ఉంటాయి.

 టాటా మోటార్స్..

టాటా మోటార్స్..

ప్రపంచవ్యాప్తంగా బెంచ్‌మార్క్ చేసిన అత్యుత్తమ రీసైక్లింగ్ ప్రక్రియలతో, భవిష్యత్ ఉపయోగం కోసం స్క్రాప్ నుంచి గరిష్ట విలువను అందించాలని తాము భావిస్తున్నట్లు టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ తెలిపారు. కేంద్ర మంత్రి దూరదృష్టిని అభినందించారు. నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద దేశవ్యాప్తంగా Re.Wi.Re సౌకర్యాల ఏర్పాటుకు భాగస్వాముల సహకారంతో ముందుకెళ్లాలని చూస్తున్నట్లు వెల్లడించారు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *