[ad_1]
అనుకున్నదొకటీ.. అయిందొకటి:
గత డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికిగాను ఫిబ్రవరి 6న టాటా స్టీల్ ఫలితాలను విడుదల చేసింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, 2 వేల 2 వందల కోట్లకు పైగా నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయానికి దాదాపు 9 వేల 5 వందల కోట్లు లాభాన్ని ఆర్జించింది. YoY ఆదాయం 6.08 శాతం తగ్గి, 60 నుంచి 57 వేల కోట్లకు పడిపోయిందని ఎక్స్ఛేంజి ఫైలింగ్ లో తెలిపింది. 7 శాతం మార్జిన్ తో EBITDA 4 వేల కోట్లకు పైగా ఉందని వెల్లడించింది.
భారీగా తగ్గిన నికర లాభం:
కంపెనీ నికర లాభం 88 శాతం అంటే QoQ 24.3 శాతం తగ్గి రూ. 1,146 కోట్లకు చేరవచ్చని.. ఓ ప్రముఖ పోల్ లో పాల్గొన్న బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. కానీ దాదాపు రెట్టింపు నష్టాలతో టాటా స్టీల్ షాక్ ఇచ్చింది. కంపెనీ నికర రుణం రూ. 71,706 కోట్లు కాగా.. EBITDAతో పోలిస్తే 1.76 రెట్లు, ఈక్విటీకి 0.65 రెట్లుగా ఉంది.
ఐరోపాలో మందగమనే కొంపముంచిందా..?
యూరప్‌లో రియలైజేషన్స్ మరియు స్ప్రెడ్‌లలో భారీ తగ్గుదల వల్ల తమ లాభాలు ప్రభావితమయ్యాయని కంపెనీ తెలిపింది. “భారత్ లో ముడిసరుకు ధరలు తగ్గాయి కానీ స్టీల్ ధరలు సైతం తగ్గాయి. తద్వారా Q2లో పెట్టుకున్నమార్జిన్ 16 శాతాన్ని Q3లో 18కి పెంచినా ఉపయోగం లేకుండా పోయింది. ఐరోపా మార్కెట్ లో కార్యకలాపాలు మందగించడం, ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల ఊహించిన నంబర్లు సాధించలేకపోయాం” అని టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కౌశిక్ ఛటర్జీ అన్నారు.
భవిష్యత్ ప్రణాళికలు:
దేశీయంగా 4.74 మిలియన్ టన్నులు డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. అందులో 11 శాతం వృద్ధిని సాధించినట్లు వెల్లడించింది. ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL) తన కార్యకలాపాలు ప్రారంభించిందని ప్రకటించింది. దాదాపు 1 MTPA సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నట్లు చెప్పింది. ఈ త్రైమాసికంలో క్యాపెక్స్‌పై రూ.3,632 కోట్లను ఖర్చు చేసినట్లు కంపెనీ పేర్కొంది. కళింగనగర్‌లో 6 MTPA ప్లాంట్ ను దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. 2.2 MTPA కోల్డ్ రోల్ మిల్ కాంప్లెక్స్, 5 MTPA విస్తరణ పనులు కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.
[ad_2]
Source link