PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

tax: కొత్త విధానంలోనూ ఆదాయపు పన్ను మినహాయింపులు పొందవచ్చని మీకు తెలుసా..?


ఆకర్షణీయంగా కొత్త విధానం

కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మారుస్తూ, ఉద్యోగులను అటువైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే ఈసారి బడ్జెట్‌ లో ప్రత్యేకంగా కొత్త విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయపు పన్ను తగ్గింపులను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు పాత పన్ను విధానంలోనే మినహాయింపులను క్లయిమ్ చేసుకోవచ్చు కానీ కొత్త విధానంలో కుదరదు అని సాధారణంగా అందరూ భావిస్తుంటారు. కానీ నిజం ఏమిటంటే, నూతన విధానంలోనూ మూడు రకాలుగా పన్ను ఆదా చేసుకోవచ్చు.

స్టాండర్డ్ డిడక్షన్

స్టాండర్డ్ డిడక్షన్

జీతం లేదా పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం నుంచి స్టాండర్డ్ డిడక్షన్ కింద తగ్గింపు పొందేందుకు ఉద్యోగులను ప్రభుత్వం అనుమతించింది. గతంలో కేవలం పాత విధానంలో మాత్రమే ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త విధానంలోనూ రూ.50 వేల వరకు పన్ను తగ్గింపు పొందవచ్చు. టాక్స్ లెక్కించేటప్పుడే ఆయా కంపెనీలు ఈ మినహాయింపును ఆటోమేటిక్‌ గా తీసుకుంటాయి. కాబట్టి దీని కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొత్త విధానంలో పింఛనుదారులకు రూ.15 వేల మేరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది.

సెక్షన్ 80CCD (2) - నేషనల్ పెన్షన్ సిస్టం:

సెక్షన్ 80CCD (2) – నేషనల్ పెన్షన్ సిస్టం:

ఉద్యోగుల నేషనల్ పెన్షన్ సిస్టం ఖాతాకు కంపెనీ అందిస్తున్న కాంట్రిబ్యూషన్ పై సెక్షన్ 80 CCD(2) కింద కొత్త పన్ను విధానంలో మినహాయింపు పొందవచ్చు. అంటే నిబంధనల ప్రకారం, ఎవరైనా ప్రైవేటు రంగంలోని ఉద్యోగి తన బేసిక్ వేతనంలో గరిష్ఠంగా 10 శాతాన్ని NPSకి కంట్రిబ్యూట్ చేయవచ్చు. దీనికి పన్ను మినహాయింపు వర్తిస్తుందన్నమాట. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ లిమిట్ 14 శాతం వరకు అనుమతించబడింది.

సెక్షన్ 80CCH - అగ్నివీర్స్:

సెక్షన్ 80CCH – అగ్నివీర్స్:

ఉద్యోగులు భవిష్యనిధి కోసం ఏవిధంగా కంట్రిబ్యూట్ చేస్తారో, ‘అగ్నిపథ్ స్కీమ్ 2022’ కింద నమోదు చేసుకున్న వ్యక్తులు ‘అగ్రివీర్ కార్పస్ ఫండ్’ కోసం తమ జీతంలో కొంత మొత్తాన్ని వెచ్చిస్తారు. ఇందుకు సంబంధించిన రసీదులను సమర్పించి సెక్షన్ 10(12C) కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. పాత, కొత్త రెండు పన్ను విధానాల్లోనూ 80CCH కింద ఇందుకు అవకాశం కల్పించారు. అగ్నివీర్ కంట్రిబ్యూషన్‌ కు సమానంగా EPF స్థానంలో కేంద్రం సహకారం అందిస్తుంది. ఈ నిధి మొత్తాన్ని రక్షణ మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *