News

oi-Mamidi Ayyappa

|

Kanti Velugu Scheme: ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంలో ఇటీవల కంటి వెలుగు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. దీనికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను సైతం మంచిగా తీర్చిదిద్దింది.

తెలంగాణ ప్రభుత్వం శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు పథకం కింద 43 లక్షల మందికి పైగా పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరి 18న స్కీమ్ రెండవ దశలో నెలరోజుల మార్కును చేరుకుంది. ఈ సమయంలో దాదాపు 8.42 లక్షల మంది ఉచిత ప్రిస్క్రిప్షన్ గ్లాసులను అందుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

 రికార్డులు స్థాయిలో కంటి వెలుగు పరీక్షలు.. తెలంగాణ నలుమూలలక

రాష్ట్రంలో అంధత్వాన్ని నివారించేందుకు ఉద్దేశించిన ‘కంటి వెలుగు’ పథకం రెండో దశను తెలంగాణ సీఎం కేసీఆర్ జనవరి 19న ప్రారంభించారు. ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌లో భాగంగా 1500 మంది కంటి వైద్యుల బృందం 100 రోజుల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించింది. ఈ క్రమంలో కంటి పరీక్షలు, దృష్టి పరీక్షలు నిర్వహించడంతో పాటు కళ్లద్దాలను ఉచితంగా అందజేసి సాధారణ కంటి జబ్బులకు మందులు అందజేస్తున్నారు.

రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారని ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన అధికారులు వెల్లడించారు. దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోవటం అనేది ఒక సాధారణ వ్యాధి, మరికొందరిలో దగ్గరగా ఉండే వస్తువులు కనిపించవు.. ఇలాంటి విటిని సరిచేసేందుకు వైద్యులను సంప్రదించటం ముఖ్యం.

 రికార్డులు స్థాయిలో కంటి వెలుగు పరీక్షలు.. తెలంగాణ నలుమూలలక

40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు సాధారణంగా దగ్గరి వస్తువులు కనిపించటం లేదని కంటి చూపు మందగించిందని ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి సమస్యకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు స్కీమ్ కింద వైద్యులు ప్రిస్క్రిప్షన్ మేరకు గ్లాసెస్ ఉచితంగా అందిస్తోంది. వీటితో పాటు విటమిన్ A, D, B కాంప్లెక్స్ మాత్రలను సైతం ప్రభుత్వం నిర్వహిస్తున్న శిబిరాల్లో అందిస్తున్నారు.

English summary

Telangana BRS government’s Kanti Velugu Scheme served 43 lakh people

Telangana BRS government’s Kanti Velugu Scheme served 43 lakh people…

Story first published: Sunday, February 19, 2023, 10:49 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *