PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Telecom: రేపు ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్.. 2024 నాటికి దీన్ని సాధించడమే కేంద్రం లక్ష్యం


News

lekhaka-Bhusarapu Pavani

|


Telecom:

ఈరోజుల్లో
కమ్యూనికేషన్స్
రంగానికున్న
ప్రాముఖ్యత
ఎనలేనిది.
అయిన
వారికి
దూరంగా
ఉన్నా,
ఫోన్ల
ద్వారా
నిత్యం
అందుబాటులో
ఉంటున్నాం.
ఇందుకు
కారణం
ఆయా
టెలికాం
కంపెనీల
నెట్
వర్క్
కవరేజ్.
కానీ
ఇప్పటికీ
దేశంలో
కొన్ని
ప్రాంతాలకు
ఇంటర్
నెట్
సదుపాయం
లేకపోవడం,
నగరాలు
5Gతో
దూసుకుపోతున్న
రోజుల్లో
కేవలం
2G
తో
నెట్టుకొచ్చే
ప్రదేశాలు
ఉండటం
దురదృష్టకరం.
అయితే

పరిస్థితి
త్వరలోనే
మారనుంది.

2024
నాటికి
అన్ని
మారుమూల
గ్రామాలను
4G
నెట్‌
వర్క్‌
తో
కవర్
చేస్తామని
టెలికాం
సహాయ
మంత్రి
దేవుసిన్
చౌహాన్
తెలిపారు.
మరింత
అభివృద్ధి
సాధించే
దిశగా
ప్రయత్నం
చేయాలని
ప్రధాని
నరేంద్ర
మోడీ
నిరంతరం
పేరేపిస్తారని
వెల్లడించారు.
‘మన్
కీ
బాత్’
కార్యక్రమంలోనూ
ప్రభుత్వ
పథకాలు
చివరి
మైలు
వరకు
ప్రజల్లోకి
తీసుకెళ్లాలని
చెబుతుంటారని
గుర్తు
చేశారు.
వీటిని
ప్రేరణగా
తీసుకుని
ముందుకు
సాగుతున్నట్లు
చెప్పారు.

Telecom: రేపు 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్.. 2024 నాటికి దీన్న

‘మెరుగ్గా
పని
చేస్తున్నారని
ప్రధాని
ప్రశంసించినా,
ప్రతి
ఇంటినీ
కవర్
చేసే
విధంగా
ప్రయత్నించమని
చెబుతారు.
4G
సంతృప్త
ప్రాజెక్ట్
గురించి
చూస్తే
దాదాపు
40
వేల
గ్రామాలకు
సిగ్నల్
లేదు.
2024
నాటికి
వాటిని
పూర్తి
చేయాలని
లక్ష్యంగా
పెట్టుకున్నాము’
అని
చౌహాన్
తెలిపారు.
ఆదివారం
ప్రసారం
కానున్న
‘మన్
కీ
బాత్’
100వ
ఎపిసోడ్
వేడుకలను
పురస్కరించుకుని
ఆయన

వ్యాఖ్యలు
చేశారు.

Telecom: రేపు 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్.. 2024 నాటికి దీన్న

ఇన్
స్టాల్
చేసిన
అన్ని
గ్రామాల్లో
4జీ
నెట్‌వర్క్
సామాజిక,
ఆర్థిక
పరివర్తనకు
దారి
తీస్తుందని
మరియు
డిజిటల్
అంతరాలను
తగ్గించగలదని
మంత్రి
పేర్కొన్నారు.
చివరి
మైలు
వద్ద
ఉన్న
పౌరుడు
కూడా
డిజిటల్‌
గా
కనెక్ట్
అయితేనే
ప్రభుత్వ
జవాబుదారీతనాన్ని
తనిఖీ
చేయగలడన్నారు.
గ్రామాలను
కనెక్ట్
చేయడం
అంటే
ప్రజాస్వామ్య
విలువలతో
ప్రజలను
సమీకరించడమేనని
తెలిపారు.
26
వేల
316
కోట్లతో
దేశవ్యాప్తంగా
అన్‌
కవర్డ్
గ్రామాల్లో
4G
మొబైల్
సేవలను
కల్పించేందుకు
కేంద్ర
మంత్రివర్గం
జూలై
2022లోనే
ఆమోదించడం
గమనార్హం.

English summary

Telecom MoS told to cover all villages with 4G within 2024 is government aim

Telecom MoS told to cover all villages with 4G within 2024 is government aim

Story first published: Sunday, April 30, 2023, 9:08 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *