మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు…

TSPSC
Updated On : June 6, 2025 / 11:37 PM IST
TGPSC Big Alert: తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు బిగ్ అలర్ట్. గ్రూప్-3 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను టీజీపీఎస్ సీ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. ఒకవేళ ఈ డేట్స్ లో హాజరు కాలేకపోతే వారి కోసం జూలై 9 రిజర్వ్‌డేగా ఉంటుందని టీజీపీఎస్ సీ తెలిపింది. హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీలో ఈ వెరిఫికేషన్ ఉంటుంది. ఉదయం 10.30గంటలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
మొత్తం 1,388 పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి గ్రూప్-3 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రాత పరీక్షను నిర్వహించడంతో పాటు ఫలితాల విడుదలలో భాగంగా టీజీపీఎస్సీ జీఆర్‌ఎల్‌ను సైతం ప్రకటించింది. తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌తో పాటు.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారి వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ నెల 17 నుంచి జూలై 9 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని కమిషన్ తెలిపింది.
Also Read: విద్యార్థులకు అలెర్ట్.. గడువు ముగుస్తోంది.. ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి
మరోవైపు గ్రూప్ -1 అభ్యర్థులకు మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన వివరాలనూ కమిషన్ వెల్లడించింది. ఈ నెల 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల వెరిఫికేషన్ ముగిసింది. మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది కమిషన్. ఆ తేదీలో హాజరుకాలేని వారి కోసం ఈ నెల 17 రిజర్డ్ డేగా ప్రకటించారు.
