ఈ-కామర్స్ దిగ్గజైనా తప్పట్లే..

దాదాపు 2 వేల 300 ఉద్యోగాలు కోత విధిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులకు అమెజాన్‌ హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. అమెరికా, కెనడా, కోస్టారికా నుండి ఉద్యోగులను తగ్గించుకోవడానికి సిద్ధమైంది. ఈ పరిస్థితిల్లో ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ.. లింక్డ్ ఇన్ లో పంచుకుంటున్న వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

మైక్రోసాఫ్ట్ కూ మాంద్యం సెగ:

మైక్రోసాఫ్ట్ కూ మాంద్యం సెగ:

ఆర్థిక మాంద్యం భయాల కారణంగా టెక్ కంపెనీలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఉద్యోగుల కంట నీరు తెప్పిస్తున్నాయి. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సైతం ఇంజనీరింగ్ విభాగాల్లో దాదాపు 10 వేల ఉద్యోగాల కోతను ప్రకటించి ఆశ్చర్య పరిచింది. కీలకమైన, వ్యూహాత్మక కృత్రిమ మేధ వంటి విభాగాల్లో కొత్తగా నియామకాలు చేపడతామని సీఈవో సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు.

అదే బాటలో మెటా, సేల్స్‌ఫోర్స్..

అదే బాటలో మెటా, సేల్స్‌ఫోర్స్..

సేల్స్‌ఫోర్స్, మెటా సహా ఇతర టెక్ బ్రాండ్‌లు సైతం ఇటీవల నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించాయి. సేల్స్‌ఫోర్స్ గతేడాది వందలాది మందికి ఉద్వాసన పలకగా.. రాబోయే రోజుల్లో మొత్తం 10 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు ప్రకటించింది. మెటా 11 వేల మందిని తొలగించింది.

స్కేలింగ్ బ్యాక్ తప్పదు:

స్కేలింగ్ బ్యాక్ తప్పదు:

స్కేలింగ్ బ్యాక్ డ్రైవ్ అనేది టెక్ కంపెనీలు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి తీసుకునే చర్యల్లో ఒక భాగం. ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని..కష్టమైనా తప్పనిసరి పరిస్థితిలో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *