Wednesday, May 18, 2022

toolkit case: దిశ రవి అరెస్టును ఖండించిన రైతు సంఘాలు -ఈనెల 18న రైల్ రోకో

National

oi-Madhu Kota

|

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారంతో 82వ రోజు పూర్తయింది. కాగా, ఈ ఉద్యమంలో విదేశీ శక్తుల పాత్ర ఉందని ఆరోపిస్తోన్న కేంద్రం.. ఆ మేరకు ‘టూల్ కిట్’ కుట్ర కేసులో సంచలన చర్యలకు దిగడం, అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన టూట్ కిట్(ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళిక)ను రూపొందించారనే ఆరోపణలపై ఇద్దరు యువ కార్యక్తలను అరెస్టుచేయడం తెలిసిందే..

పర్యావరణ, సామాజిక కార్యకర్తలైన దిశ రవి, నికితా జాకబ్ లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని రైతు సంఘాలు ఖండించాయి. రైతుల ఆందోళనలపై ‘టూల్‌కిట్‌’ రూపొందించిన కేసులో వారిని అరెస్ట్‌ చేయడంపై రైతులు మండిపడ్డారు. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఒక ఖండన ప్రకటనను సోమవారం విడుదల చేసింది.

నిమ్మగడ్డ మరో సంచలనం -జగన్ సమ్మతితో ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్? -అత్యంత సంక్లిష్టం

”రైతుల ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నంలో ప్రభుత్వం పోలీసుల అధికారాన్ని దుర్వినియోగం చేయడంపై సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతున్నది. యువ పర్యావరణ కార్యకర్త దిశ రవిని సరైన విధానాలు పాటించకుండా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నది. ఆమెను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తున్నది” అని ప్రకటనలో పేర్కొన్నారు.

కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కూడా దిశ అరెస్ట్‌ను ఖండించింది. రైతుల ఉద్యమానికి భయపడిన మోడీ ప్రభుత్వం 21 ఏండ్ల యువతిని అరెస్టు చేయడం ద్వారా మానవాళిని చంపుతున్నదని విమర్శించింది. ఢిల్లీలో జనవరి 26న జరిగిన హింసాకాండను నివేదించిన పలువురు జర్నలిస్టులపై నమోదు చేసిన దేశద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలని కేఎస్ఎంసీ డిమాండ్‌ చేసింది. కాగా,

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోనన ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామని రైతు సంఘాలు తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటలపాటు రైల్‌ రోకోకు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. రిపబ్లిక్ డే నాటి ట్రాక్టర్ల ర్యాలీలో హింస తర్వాత రైతులు, కేంద్రం మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోవడం తెలిసిందే.

కోర్టులో బోరుమన్న దిశ రవి -గ్రెటా ‘టూల్ కిట్’ కేసులో 5రోజుల రిమాండ్ -భారీ మద్దతు -అసలేంటీ కేసు?


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe