[ad_1]
ట్విట్టర్ బ్లూ..
ఇన్నాళ్లుగా వేచి ఉన్న ఇండియాలోని ట్విట్టర్ యూజర్లకు కంపెనీ తాజాగా ప్రకటన చేసింది. దీని ప్రకారం ట్విట్టర్ బ్లూ ధృవీకరణకు సబ్‌స్క్రిప్షన్ రేట్లను కంపెనీ విడుదల చేసింది. దీని కింద చెక్‌మార్క్ తో పాటు ట్వీట్‌లను ఎడిట్ చేసే సామర్థ్యంతో సహా అదనపు ఫీచర్లను ట్విట్టర్ ప్రస్తుతం అందిస్తోంది.
నెలవారీ రుసుములు..
ట్విట్టర్ వినియోగదారులకు వెబ్ లో నెలకు రూ.650ని రుసుముగా కంపెనీ నిర్ణయించింది. అలాగే మెుబైళ్లలో ట్విట్టర్ సేవలను వినియోగించుకునే యూజర్లకు నెలవారీ రుసుము రూ.900గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఎవరైనా వినియోగదారుడు వార్షిక ప్యాకేజీని ఒకేసారి తీసుకున్నట్లయితే వారికి తగ్గింపులో ఈ సేవలను కేవలం రూ.6,800కే అందిస్తున్నట్లు తెలిపింది. అంటే ఏడాదికి ఒకేసారి చెల్లించాలనుకునేవారుకి సగటున నెలకు రూ.566.67 ఖర్చవుతుంది.
మర్చిపోకూడని విషయం..
ట్విట్టర్ బ్లూ సేవలను ఇండియాలో ప్రారంభించటానికి ముందే మస్క్ ఈ సేవలను అనేక ప్రపంచ దేశాల్లో ప్రవేశపెట్టారు. గతవారం ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అదేంటంటే ట్విట్టర్ బ్లూ వినియోగదారులతో కంపెనీ యాడ్ ఆదాయాన్ని పంచుకుంటుందని. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో ట్విట్టర్ బ్లూ సేవలు భారత్ లో అధికారికంగా ప్రారంభం కాలేదు. రానున్న కాలంలో దీనిపై కంపెనీ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొత్త ఫీచర్స్..
కంపెనీ ప్రవేశపెడుతున్న ట్విట్టర్ బ్లూ సేవలను కొనుగోలు చేసే వినియోగదారులకు.. ట్వీట్లను ఎడిట్ చేసుకునేందుకు ఆప్షన్ లభిస్తుంది. దీనికి తోడు 1080p వీడియోలను అప్‌లోడ్ చేసే సదుపాయం దొరుకుతుంది. అలాగే వీరికి రీడర్ మోడ్ కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా Twitter బ్లూ వినియోగదారులు నాన్-పెయిడ్ వినియోగదారుల కంటే తక్కువ ప్రకటనలను చూస్తారని కంపెనీ చెబుతోంది. చివరిగా వినియోగదారులు ట్వీట్ల కోసం 4 వేల అక్షరాల పరిమితిని పొందుతారు.
[ad_2]
Source link