[ad_1]
News
oi-Mamidi Ayyappa
Union Budget 2023: అందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అదే వార్షిక ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టడం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 5వ సారి బడ్జెట్ ప్రసంగాన్ని నేడు చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె కట్టుకున్న చీర మరోసారి వార్తల్లో నిలిచింది. 2019 నుంచి 2022 వరకు నిర్మలా సీతారామన్ కట్టుకునే చీరలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.
మరికొన్ని నిమిషాల్లో పార్లమెంటులో యూనియన్ బడ్జెట్ 2023-24 ప్రసంగం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆమె నార్త్ బ్లాక్ వద్ద ఎర్రచీరలో బడ్జెట్ పత్రాలు కలిగి ఉన్న ఎరుపు రంగు సూట్ కేసుతో ప్రత్యక్షమయ్యారు. దీనికి ముందు నిర్మలమ్మ జనవరి 26న జరిగిన జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకకు ఆకుపచ్చ, పసుపు రంగు కంజీవరం చీర ధరించి హాజరయ్యారు.
కొన్ని ప్రత్యేకమైన సందర్బాల్లో మాత్రమే నిర్మలా సీతారామన్ స్పెషల్ చీరలు కట్టుకుంటారు. సమాచారం ప్రకారం ఈరోజు బడ్జెట్ కోసం సంబల్‌పురి పట్టు చీర కట్టుకున్నారు. దీనినే టెంపుల్ చీర అని కూడా అంటారు. ఈ చీరకు ఒడిశా రాష్ట్రంతో ప్రత్యేక సంబంధం ఉంది. 2019లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు చేనేత చీరను ధరించి కనిపిస్తుంటారు.
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman all set to present the #UnionBudget2023 at 11am today.
This is the BJP government’s last full Budget before the 2024 general elections. pic.twitter.com/8CFywfihvq
— ANI (@ANI) February 1, 2023
2019లో తొలిసారి ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి బడ్జెట్ సమయంలో నిర్మలమ్మ గులాబీతో బంగారు రంగు అంచు ఉన్న చీరను ధరించారు. దీనిని మంగళగిరి చీర అని కూడా పిలుస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సంబల్‌పురి, ఇకత్, కంజీవరం చీరల్లో కనిపిస్తుంటారు.
English summary
Union Finance minister nirmala sitharaman appeared in red saree for budget 2023
Union Finance minister nirmala sitharaman appeared in red saree for budget 2023
Story first published: Wednesday, February 1, 2023, 10:43 [IST]
[ad_2]
Source link
Leave a Reply