తక్కువ ఖర్చుతో..
భారత ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగపూర్‌లోని వ్యక్తులకు డబ్బు బదిలీ చేయడానికి Google Pay, Paytm వంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించే భారతీయులు తక్కువ-ధర, వేగవంతమైన, 24×7 క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని ఈ ప్రాజెక్ట్ ద్వారా పొందుతారు.
2021లో..
రెండు దేశాల మధ్య వాణిజ్యం, ట్రావెల్ అండ్ రెమిటెన్స్‌లకు సంబంధించి వేగంగా, మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా సరిహద్దు లావాదేవీలను సులభతరం చేయడానికి రెండు దేశాల్లోని వేగవంతమైన చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించే ప్రాజెక్టును సింగపూర్-ఇండియా ప్రభుత్వాలు సెప్టెంబర్ 2021లో ప్రారంభించాయి. సింగపూర్‌లో వేగవంతమైన చెల్లింపు వ్యవస్థ PayNow.. అక్కడి బ్యాంకులు, NFIల ద్వారా పీర్-టు-పీర్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సర్వీస్‌ను కస్టమర్లకు అందిస్తుంది. అయితే నేడు UPI-PayNow అనుసంధానం చేయటం వల్ల రెండు దేశాల మధ్య సరిహద్దు చెల్లింపుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలక మైలురాయి పడింది.

UPI అంటే ఏమిటి?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా అభివృద్ధి చేయపడిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. దీనిని వినియోగించి ఎవరైనా వ్యక్తి వేగంగా, తక్షణమే నిధులను బదిలీ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. వర్చువల్ చెల్లింపు చిరునామా ద్వారా బ్యాంక్ వివరాలు పంచుకోకుండా చెల్లింపులు చేసుకునేందుకు ఈ విధానం అనుమతిస్తుంది. రియల్ టైమ్ సిస్టమ్ పర్సన్-టు-పర్సన్ (P2P), పర్సన్-టు-మర్చంట్ (P2M) చెల్లింపులకు మద్దతునిస్తుంది.