PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

US Crisis: బిల్లుల చెల్లింపుకు డబ్బు అయిపోతోంది.. అలర్ట్ అయిన జోబైడెన్..!


News

oi-Mamidi Ayyappa

|

US
Crisis:
అమెరికాను
ఒకటి
తర్వాత
మరొక
సమస్య
వెంటాడుతోంది.
అగ్రరాజ్యం
ఆర్థిక
వ్యవస్థలో
అల్లకల్లోలాలు
పెరుగుతున్న
క్రమంలో
ప్రపంచ
దేశాలు
జాగ్రత్తపడుతున్నాయి.
అక్కడ
మాంద్యం
ఏర్పడి
ఆర్థిక
సంక్షోభం
నెలకొంటే
ప్రపంచం
అతలాకుతలం
అవుతుంది.

అమెరికా
ప్రస్తుతం
పెద్ద
ఇబ్బందుల్లో
ఉన్నందున
ప్రపంచం
భారీ
ఆర్థిక
సంక్షోభం
వైపు
దూసుకుపోవచ్చని
నిపుణులు
ఆందోళన
వ్యక్తం
చేస్తున్నారు.
యూఎస్
ఫెడరల్
ప్రభుత్వం
రుణ
పరిమితిని
త్వరగా
పెంచుకోకపోతే
జూన్
నాటికి
బిల్లులు
చెల్లించేందుకు
డబ్బు
కొరత
ఏర్పడుతుందని
ట్రెజరీ
సెక్రటరీ
జానెట్
యెల్లెన్
తెలిపారు.
దీర్ఘకాలంలో
ఇబ్బందులు
రాకుండా
ఉండాలంటే
రుణ
పరిమితులపై
కాంగ్రెస్
చర్యలు
తీసుకోవాలని
స్పీకర్
కెవిన్
మెక్‌కార్తీకి
రాసిన
లేఖలో
యెల్లెన్
వెల్లడించారు.

US Crisis: బిల్లుల చెల్లింపుకు డబ్బు అయిపోతోంది.. అలర్ట్ అయి

ప్రపంచ
ఆర్థిక
వ్యవస్థను
కుదిపేసే
అపూర్వమైన
డిఫాల్ట్‌కు
యునైటెడ్
స్టేట్స్
దారితీసే
ప్రమాదం
ఉందని
వారు
అంచనా
వేస్తున్నారు.
దీని
తర్వాత
అమెరికా
అధ్యక్షుడు
జో
బైడెన్
సంక్షోభాన్ని
నివారణ
చర్యలపై
మాట్లాడేందుకు
నలుగురు
అగ్ర
కాంగ్రెస్
నాయకులను
మే
9న
వైట్
హౌస్‌కి
ఆహ్వానించారు.
దీనికోసం
రిపబ్లికన్
హౌస్
స్పీకర్
కెవిన్
మెక్‌కార్తీ,
హౌస్
డెమోక్రటిక్
లీడర్
హకీమ్
జెఫ్రీస్,
సెనేట్
మెజారిటీ
లీడర్
చక్
షుమర్,
రిపబ్లికన్
లీడర్
మిచ్
మెక్‌కానెల్‌
వెళ్లనున్నారు.

ఇదిలా
ఉండగా..
హౌస్
రిపబ్లికన్లు
మాత్రం
రుణ
పరిమితిని
పెంచడానికి
బదులుగా
లోతైన
వ్యయ
కోతలు,
ఇతర
విధాన
మార్పులను
డిమాండ్
చేస్తున్నారు.
అయితే
బిడెన్
రుణ
పరిమితి
పెంపుపై
చర్చలు
జరపడం
లేదని,
కొత్త
పరిమితిని
ఆమోదించిన
తర్వాత
బడ్జెట్
కోతలపై
చర్చిస్తానని
స్థిరంగా
చెప్పారు.
2011లో
ఇదే
విధమైన
రుణ
పరిమితి
పోరాటం
దేశాన్ని
డిఫాల్ట్
అంచుకు
తీసుకువెళ్లింది.
యూఎస్
అగ్రశ్రేణి
క్రెడిట్
రేటింగ్‌ను
డౌన్‌గ్రేడ్
చేయడానికి
ప్రేరేపించింది.
సామాజిక
భద్రత,
మెడికేర్
వంటి
ప్రయోజన
కార్యక్రమాలు
బడ్జెట్‌లో
అగ్ర
భాగాన్ని
కలిగి
ఉన్నాయి.

English summary

US to run out of cash soon as debt ceiling limits not raised by Biden Government

US to run out of cash soon as debt ceiling limits not raised by Biden Government

Story first published: Tuesday, May 2, 2023, 11:12 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *