[ad_1]
అత్యంత తక్కువ ఇవే
25 MBPS డౌన్‌లోడ్ మరియు 3 MBPS అప్‌లోడ్‌లే అమెరికాలో అత్యంత తక్కువ విలువైన ప్లాన్‌లు కాగా.. అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో లేవు. ప్రజలందరికీ ఇంటర్నెట్ అందుబాటులో తెచ్చేందుకుగాను భౌగోళిక అసమానతలను పరిష్కరించే ప్రయత్నాలు అక్కడ ఎప్పటినుంచో జరుగుతూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని భౌతిక వనరులు, ప్రజల ఖర్చుపెట్టే సామర్థ్యం వల్ల పలు ప్రాంతాల్లో ధరలు మారుతూ ఉంటాయి.
అన్ని రాష్ట్రాల్లోనూ అంతంతమాత్రమే..
ఎక్కువ ఆదాయ స్థాయి రాష్ట్రాలతో పోలిస్తే ఇతర రాష్ట్రాల ప్రజలకు.. చవకగా లభించే ఈ ప్రాథమిక బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందే అవకాశం తక్కువగా ఉన్నట్లు బ్రాడ్‌బ్యాండ్ ధరలు, కవరేజీలను విశ్లిషించిన బ్రాడ్‌బ్యాండ్‌నౌ అనే సంస్థ నివేదించింది. ఇతర రాష్ట ప్రజల సరాసరి ఆదాయాన్ని కొలంబియాతో పోల్చి, సుమారు 2 వేల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ISP) నుంచి సేకరించిన సమాచారం ద్వారా ఈ నివేదిక రూపొందించినట్లు పేర్కొంది.
వివిధ రాష్ట్రాల్లో…
70 వేల డాలర్లకు తక్కువ ఆదాయమున్న 10 రాష్టాల్లో కేవలం సగం మందికి మాత్రమే కనీసం ప్రాథమిక స్థాయి బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. సరాసరి ఆదాయం 40 వేల డాలర్ల కంటే తక్కువ ఉన్న మిస్సిసిపిలో అయితే కేవలం మూడింట ఒక వంతుకే ఈ సౌకర్యం ఉన్నట్లు తెలిపింది. కనెక్టికట్ మరియు వాషింగ్టన్ డీసీ,డెలావేర్,హవాయి లోని దాదాపు ప్రతి నివాసికి తక్కువ-ధర ప్రణాళికలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది.
వివక్ష వల్లే ధరల పెరుగుదల:
రాష్ట్రం, ప్రాంతాన్ని బట్టి బ్రాడ్‌బ్యాండ్ ధరలు, సేవల్లో తీవ్ర వ్యత్యాసమున్నట్లు నివేదిక రూపొందించిన టైలర్ కూపర్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ ధరలు ప్రభుత్వ నియంత్రణలో లేనందున సేవలను అందించడంలో ఇంటర్‌నెట్ ప్రొవైడర్‌లు వివక్ష చూపుతున్నట్లు తెలిపారు. భారీ స్థాయి బిల్లులను భరించలేని అట్టడుగు వర్గాలు బ్రాడ్‌బ్యాండ్ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగ అవకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుదంని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శ్వేతజాతీయలుకే పెద్దపీట:
కరోనా కారణంగా ఇంటి నుంచి పని, ఆన్‌లైన్ విద్యలకు ఇంటర్నెట్ విరివిగా అవసరం కావడం వల్ల.. కొన్ని నగరాలు మున్సిపల్ నెట్‌వర్క్‌ను ఏర్పరచుకున్నాయి. ఇంటర్నెట్ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకుని చౌకగా, హై స్పీడ్‌తో కూడిన సేవలను అందించడానికి ముందుకు వచ్చాయి. తద్వారా పేదలకు సైతం బ్రాండ్‌బ్యాండ్ సేవలు బాగా దగ్గరయ్యాయి.
ఏటీ & టీ, సెంచరీ లింక్ వంటి పలు సర్వీస్ ప్రొవైడర్ల ధరలను విశ్లేషించగా.. ప్రాంతం ఆధారంగా వేగాన్ని బట్టి ధరలు వసూలు చేస్తున్నట్లు ద మార్కప్ మరియు అసోసియేటెడ్ ప్రెస్ పరిశోధన వెల్లడించింంది. శ్వేతజాతీయేతరులకు అత్యంత నెమ్మదిగా ఉండే సేవలు అందిస్తున్నట్లు నివేదినకలు వెలువడగా.. ఆయా కంపెనీలు ఈ ప్రకటనలను ఖండించాయి.
ప్రభుత్వం ఏం చేస్తోంది..?
స్థానిక ప్రభుత్వాలకు మౌలిక సదుపాయాల కల్పన, తక్కువ ఆదాయ కుటుంబాల కోసం సబ్సిడీ ద్వారా వేగవంతమైన నెట్ అందుబాటులో ఉంచేందుకు జో బైడెన్ ప్రభుత్వం 2021లో చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇందు కోసం బ్రాడ్‌బ్యాండ్ ఈక్విటీ, యాక్సెస్ మరియు డిప్లాయ్‌మెంట్ (బీఈఏడి) పథకం ద్వారా 42 బిలియన్ డాలర్లను ఖర్చుపెట్టేందుకు అంగీకరించింది. తద్వారా భవిష్యత్తులో ఇంటర్నెట్ ధరలు మరింత తగ్గుతాయని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.
[ad_2]
Source link
Leave a Reply