Feature
oi-Dr Veena Srinivas
మీరు
నిరంతర
ఆర్థిక
ఇబ్బందులతో
బాధపడుతున్నారా?
ఎంత
కష్టపడినా
సరైన
ప్రతిఫలం
లేక,
సంపాదించిన
డబ్బు
నిలవక
కష్టపడుతున్నారా?
అయితే
కచ్చితంగా
ఇంట్లో
ఎక్కడైనా
వాస్తు
దోషం
ఉండి
ఉండవచ్చు
అని
చెబుతున్నారు
వాస్తు
శాస్త్ర
నిపుణులు.
ముఖ్యంగా
ఇంట్లో
డబ్బులు
నిలవడం
లేదంటే,ఈశాన్య
దిశ
వైపు
వాస్తు
దోషాలు
ఏమైనా
ఉన్నాయేమో
చెక్
చేసుకోవాలని
చెబుతున్నారు.
ఆర్థిక
ఇబ్బందుల
నుండి
బయటపడటానికి,ఈశాన్య
దిశలో
వాస్తు
దోషాలు
లేకుండా
చూడాలి.
ఈశాన్య
దిశ
లక్ష్మీ
దిశ.
డబ్బు
రాకకు
సంబంధించిన
దిశ.
ఈ
దిశలో
వాస్తుదోషాలు
తీవ్ర
ఆర్థిక
నష్టాలకు
కారణమవుతాయి.
ఈశాన్య
దిశ
శుభ్రంగా
లేకపోయినా,చెత్త
చెదారం
పెట్టినా,
బరువైన
వస్తువులను
ఈశాన్యదిశలో
పెట్టినా
తీవ్రమైన
ఆర్థిక
నష్టాలను
చవిచూడాల్సి
వస్తుంది.
రావాల్సిన
డబ్బులు
రాకపోగా,సంపాదించిన
డబ్బంతా
అనవసరపు
ఖర్చులకు
వృధాగా
పోతుంది.

ఈశాన్య
దిశలో
దుమ్ము,
ధూళి,
చెత్తా,
చెదారం
ఉంటే
అది
వ్యాపార
వృద్ధిని,
లాభాలను
కూడా
ప్రభావితం
చేస్తుంది.ఈశాన్య
దిశలో
అన్ని
సమయాలలో
వెలుతురు
ఉండాల్సిన
అవసరం
ఉంది.
ఈశాన్య
దిశలో
చీకటిగా
ఉంటే
కుటుంబ
సభ్యుల
మధ్య
విభేదాలు
పెరుగుతాయి.
అందుకే
ఈశాన్య
దిశలో
ఎప్పుడూ
వెలుతురు
ఉండాల్సిన
అవసరం
ఉంది.
చాలా
మంది
దక్షిణం
వైపు
తలుపు
వుండేలా
బీరువాలను
పెడుతూ
ఉంటారు.
అలా
పెట్టడం
వల్ల
ఆర్థిక
నష్టం
జరుగుతుంది.
దక్షిణ
దిశ
యమ
దిశ
కాబట్టి
ఆ
వైపు
బీరువాను
పెట్టడం
ఏ
మాత్రం
మంచిది
కాదు.
ఉత్తరం
వైపు
తలుపు
వుండేలా
బీరువాలను,
లాకర్లను
పెట్టడం
వల్ల
ఆర్థికంగా
లాభిస్తుంది.
అంతేకాదు
డబ్బులు
భద్రపరిచే
చోట
కూడా
ఎప్పుడూ
చిత్తడిగా
లేకుండా
చూసుకోవాలి.
శుభ్రంగా
ఉన్న
ఇంట్లోనే
లక్ష్మీ
దేవి
నివసిస్తుంది.
వాస్తు
నియమాలు
పాటిస్తే
లక్ష్మీదేవి
కటాక్షం
ఉంటుంది.
ముఖ్యంగా
ఇంట్లో
డబ్బులు
నిలవాలంటే
ఈశాన్యం
దిశ,
దక్షిణం
దిశ
విషయంలో,
డబ్బులు
పెట్టే
విషయంలో
జాగ్రత్తగా
ఉండాల్సిన
అవసరం
ఉంది.
English summary
Ever had money problems? But know that if you follow precautions in the North-East and South direction, you will get rid of financial problems.
Story first published: Thursday, May 11, 2023, 6:25 [IST]