ఇంట్లో చీమలు కనిపిస్తే భవిష్యత్ సంకేతాలు

ఇక ఆ వివరాల్లోకి వెళితే శకున జ్యోతిష్య శాస్త్రంలో చీమలు మంచి, చెడులను సూచిస్తాయని పేర్కొనబడింది. చీమలు ఇచ్చే కొన్ని సంకేతాల వల్ల మన ఇంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది? భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవచ్చని చెబుతున్నాయి. ముఖ్యంగా చీమల గురించి తెలుసుకోవాలంటే చీమలు రెండు రకాలుగా ఉంటాయని అవి ఎర్ర చీమలు, నల్ల చీమలు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మంచిదని, ఎర్ర చీమలు కనిపిస్తే శుభం కాదని శకున శాస్త్రం చెబుతుంది.

నల్ల చీమలు.. ఎర్ర చీమలు కనిపిస్తే ఏం జరుగుతుంది?

నల్ల చీమలు.. ఎర్ర చీమలు కనిపిస్తే ఏం జరుగుతుంది?

ఆఫీసులో కానీ ఇంట్లో కానీ నల్ల చీమలు బయటకు వస్తున్నాయంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్న సంకేతాన్ని ఇస్తుందని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉంటాయని, కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుందని సంకేతం అని చెబుతున్నారు. ఇక నల్ల చీమలు కూడా విపరీతంగా వస్తూ ఉంటే అది కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. నల్ల చీమలు కనిపించడం మంచిదే అయినప్పటికీ కుప్పలు కుప్పలుగా నల్ల చీమలు ఉండడం మంచిది కాదు అంటున్నారు. అదే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఎర్ర చీమలు కనిపిస్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. కొన్ని పెద్ద ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

చీమలు ఏ దిశలో వస్తే అదృష్టం

చీమలు ఏ దిశలో వస్తే అదృష్టం

అందుకే ఇంట్లో ఎర్ర చీమలు కనిపించకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఇక ఇంట్లో నల్ల చీమలు ఏ దిశలో వస్తే అదృష్టం ఏ దిశలో వస్తే దురదృష్టం అన్న విషయాలను చూస్తే పడకగదిలో నల్ల చీమలు కనిపిస్తే కొన్ని బంగారు వస్తువులను కొనుగోలు చేయవచ్చునని, ఇంటి టెర్రస్ పైన నల్ల చీమలు కనిపిస్తే త్వరలో మరో ఆస్తిని కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. చీమలు ఉత్తరం వైపు నుండి బయటకు వస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, పడమర వైపు నుంచి చీమలు బయటకు వస్తే ప్రయాణాలు చేయవలసి ఉంటుందని దక్షిణ దిశ నుండి చీమలు బయటకు వస్తే డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయని, తూర్పు దిశ నుండి చీమలు బయటకు వస్తే అదృష్టాన్ని సూచిస్తుందని చెబుతున్నారు.

డబ్బు పుష్కలంగా రావాలంటే చీమలకు పరిహారం

డబ్బు పుష్కలంగా రావాలంటే చీమలకు పరిహారం

ఇక శకున శాస్త్రంలో చీమలకు సంబంధించి కొన్ని చిట్కాలు కూడా చెప్పబడ్డాయి. ఇంట్లో డబ్బులు పుష్కలంగా ఉండాలంటే చీమలకు పరిహారం చేయాల్సిన అవసరం ఉంది. శని, రాహువుల రూపంగా పరిగణించబడే చీమలకు పిండిలో పంచదార కలిపి పెట్టినట్లయితే శని రాహుల ప్రభావం నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికి డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని చెప్పబడింది. ఇక ఉద్యోగం రాక ఇబ్బంది పడే వారు ఉద్యోగం రావాలంటే కొబ్బరికాయను రెండుగా చేసి అందులో నెయ్యి, చక్కెర నింపి చీమలకు పెట్టాలని అప్పుడు త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పబడింది.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Vastu tips: సంపాదించిన డబ్బు నిలవటం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే డబ్బుకు కొదవుండదు!!Vastu tips: సంపాదించిన డబ్బు నిలవటం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే డబ్బుకు కొదవుండదు!!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *