సొంపు, లవంగం
ఈ రెండు మసాలా దినుసులు ప్రతికూల శక్తులను ఎదుర్కొనేందుకు బాగా ఉపయోగపడతాయని కొన్ని తరాల నుంచి ఒక నమ్మకం ఉంది. తలుపుకు లేదంటే ఇంటి ప్రధాన ద్వారంగా ఉండే గుమ్మానికి సోంపు లేదంటే లవంగం చిన్న మూట కట్టి పెడతారు. దీనివల్ల దెయ్యాలు, ఆత్మలను ఇంటికి దూరంగా ఉంచుతాయనే నమ్మకం ఉంది. సోంపును తలదిండు కింద పెట్టుకుంటే బాగా నిద్రపడుతుందని, మన పర్సులో లవంగం ఉండటంవల్ల ప్రతికూల పరిస్థితులకు దూరంగా ఉంచుతుంది. సోంపు, లవంగం తీసుకోవడంవల్ల సంతానోత్పత్తితోపాటు , జ్ఞాపకశక్తి, ధైర్యం, బలం పెరుగుతాయి. లక్ష్మీ దేవికి ఎర్ర గులాబీలతో పాటు లవంగాలు కలిపి పూజ చేయడం
వల్ల డబ్బు, అదృష్టం కలిసివస్తాయని నమ్ముతారు.

గరం మసాలా
గరం మసాలా వల్ల వంట రుచిగా ఉంటుందనే విషయం తెలిసిందే. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది విజయాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఈ మసాలా ప్యాకెట్ మన జేబులో ఉండటంవల్ల అదృష్టం, డబ్బు తీసుకొస్తుందని నమ్ముతారు. లేదంటే గరం మసాలా పొడిని ఇంట్లో, షాపులో, కార్యాలయ మూలల్లో చల్లుకోవచ్చు. దాల్చిన చెక్క: మన ఆదాయంలో పొదుపు పెంచుకోవడానికి దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. దీన్ని జేబులో ఉంచుకోవడంవల్ల ప్రేమ, విజయంతోపాటు ఆరోగ్యం కూడా దక్కుతుంది. ఇది సంపదను పెంచడంలో సహాయపడుతుంది.

పుదీనా ఆకులు
వాస్తు ప్రకారం సంపద పొందేందుకు ఇది అద్భుతమైన మార్గం. మన జేబులో లేదంటే డబ్బులు ఉండే ప్రదేశంలో ప్రతిరోజు రెండు లేక మూడు పుదీనా ఆకులు ఉంచుకోవాలి. ఈ ఆకుల నుంచి వచ్చే సువాసన మనల్ని శక్తివంతం చేయడంతోపాటు మంచి ఆరోగ్యాన్నిస్తుంది. మనం పెట్టే పెట్టుబడులు కూడా సురక్షితంగా ఉండేలా చూస్తాయి. పుదీనా ఆకుల రంగు డబ్బు నోట్లకి అయ్యేలా చూసుకుంటే సంపద పెరుగుతుందనే నమ్మకం ఉంది. నల్ల మిరియాలు, పచ్చ యాలకులకు తీసుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయనే నమ్మకం పూర్వకాలం నుంచి ఉంది. యాలకులు తింటే మనసును శాంతపరుస్తుంది. గందరగోళాన్ని తగ్గించే శక్తి దీనికి ఉంటుంది. ఇవి తింటే కెరియర్ లో వృద్ధి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.