[ad_1]
ఆర్ధిక నష్టాలు కలగకుండా వాస్తు చిట్కాలు పాటించాలి
మనం ఇంటిని ఎంత వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం నిర్మించుకున్నప్పటికీ, ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో వాస్తు నియమాలను పాటించాలి. అలాగే స్థలం అనుకూలంగా లేదని వాస్తు నియమాలకు విరుద్ధంగా వంటగది, బెడ్ రూమ్ తదితరాలను నిర్మించుకున్న వారు అందుకు తగిన వాస్తు దోష నివారణలను కూడా పాటించాలి. అప్పుడే ఆ ఇంట్లో సమస్యలు కొంతమేరకు ఉపశాంతిని పొంది, ఆర్థిక ఇబ్బందుల నుండి ఆ కుటుంబాన్ని గట్టెక్కిస్తాయి.
ఈశాన్యం మూల అవి పెట్టకండి .. ధన నష్టం
ఇక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను కలిగించే ప్రధానంగా ఉండే వాస్తు దోషాలను గురించి తెలుసుకున్నట్లయితే.. చాలామంది తెలియక ఈశాన్య దిశలో చీపుర్లు, డస్ట్ బిన్ లు పెడుతుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులకు అదే కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈశాన్య మూలలో డస్ట్ బిన్ పెట్టినా, చెత్త జమ చేసినా ఆ ఇంట్లోకి డబ్బు వచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. కాబట్టి ఈ దిశలో పొరపాటున కూడా డస్ట్ బిన్ లు పెట్టొద్దు. చెత్తాచెదారాన్ని పోగు చేసుకోవద్దు.
పడమర దిశలో వంటగది ఉంటే… చెయ్యాల్సింది ఇదే
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిని ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి. అయితే కొంతమంది ఉన్న స్థలాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పడమర వైపు వంటగదిని నిర్మించుకుంటారు. అటువంటివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పడమర దిక్కులో వంటగది ఉండడం వల్ల ఆ కుటుంబానికి ఆదాయం వస్తుంది కానీ, వచ్చిన ఆదాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడదు. అనవసరపు ఖర్చులు అవుతూ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పడమర దిశలో వంటగది ఉన్నట్లయితే ఆర్థికంగా ధన నష్టం జరగకుండా, ఆ గదిలో ఆగ్నేయం దిశలో ఒక ఎర్రటి బల్బును పెట్టుకుంటే కాస్త ఆర్థిక నష్టాల నుంచి బయటపడచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
బీరువాలు, లాకర్లు ఆ దిశలోనే.. లేదంటే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
చాలామంది ఇంట్లో డబ్బులు పెట్టుకునే విషయంలో దిశ పైన దృష్టి సారించరు. ఇంట్లోని లాకర్లు, బీరువాలు ఏ దిశలో ఉంటే మంచి జరుగుతుంది.. ధన నష్టం జరగకుండా ఉంటుంది.. వంటి విషయాలను తెలుసుకోవాలి. పొరపాటున కూడా బీరువాలను, లాకర్లను ఉత్తరం దిశ నుండి దక్షిణం వైపు డోర్లు తీసేలా పెట్టకూడదు. బీరువాలను లాకర్లను దక్షిణం వైపు పెట్టుకోవాలి. వాటిని మనం తెరిచినప్పుడు బీరువా ఉత్తరం వైపుకు ఓపెన్ అవ్వాలి. ఉత్తరానికి అధిపతి కుబేరుడు కావడంతో బీరువా ను ఓపెన్ చేసినప్పుడు ఉత్తర దిక్కుకు చూస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది. అలా కాకుండా దక్షిణ దిక్కుకు బీరువా ఉంటే ధన నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేర ఆర్థిక కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
[ad_2]
Source link