[ad_1]
ఈ చెట్లను ఇళ్ళలో పెంచుకుంటే సిరి సంపదలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లల్లో కొన్ని చెట్లను పెంచుకుంటే మేలు జరుగుతుంది. ఇక అటువంటి చెట్లలో అరటి, కొబ్బరి, మామిడి, వేప, నిమ్మ, దానిమ్మ, ద్రాక్ష వంటి చెట్లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఉసిరి, ఇక ఈ చెట్లను పెంచుకోవడం వల్ల ఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతుంది. కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చెట్లను పొరబాటున కూడా ఇంటి ముందు కానీ, ఈశాన్యం మూల కానీ పెట్టకూడదు.
ఇళ్ళ ముందు పెంచుకోకూడని చెట్లు ఇవే
ఇక ఇదే సమయంలో ఇళ్ళ ముందు పెంచుకోకూడని చెట్లను కూడా సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో కానీ, ఇంటి పరిసరాలలో కానీ తుమ్మ చెట్లను పెంచుకోకూడదు. ఒకవేళ అలా తుమ్మ చెట్లను పెంచుకుంటే ఇంట్లో గొడవలు రావడమే కాకుండా కుటుంబ సభ్యులు మానసిక రుగ్మతలకు గురవుతారు. ఇంటి ముందు నిమ్మ చెట్టు ని కానీ, జామ చెట్టు ని కానీ పెంచకూడదు. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టు ను కూడా పెంచుకోకూడదు. గోరింటాకు చెట్టు ని పెంచుకుంటే కుటుంబ సభ్యుల పై ప్రతికూలమైన ప్రభావం ఉంటుంది.
గోరింటాకు, రేగు చెట్లను ఇంట్లో పెంచుతున్నారా?
గోరింటాకు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. ఇంటి లోపల మాత్రమే కాదు ఇంటి బయట కూడా గోరింటాకు చెట్లను పెంచుకోవడం మంచిది కాదు. అంతేకాదు ఇంట్లో రేగు చెట్లు ఎట్టి పరిస్థితులలోనూ పెంచకూడదు. రేగు చెట్టు కు ముళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ముళ్లు ఎక్కువగా ఉండే చెట్లను ఇంట్లో పెంచుకుంటే అటువంటి చెట్లు అనేక ఇబ్బందులను తీసుకు వస్తాయని చెబుతున్నారు. అయితే వీటి నుండి నిమ్మ చెట్టుకు మినహాయింపు ఉంది. నిమ్మకు ఉండే ప్రతికూల శక్తులను దూరం చేసే లక్షణం వల్ల నిమ్మ చెట్టు ను ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే ఇంటి ముందు నిమ్మ చెట్టు ని పెంచడం మంచిది కాదని చెబుతున్నారు.
ఆ దిశలో పెద్ద చెట్లు పెంచితే మంచిది
ఇక ఉసిరి చెట్టు ను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇక పెద్ద పెద్ద చెట్లు ఏ వేటిని పెంచినా అవి నైరుతి మూలన పెంచేలా గా జాగ్రత్త తీసుకోవాలి. ఆ దిశలో ఎంత పెద్ద చెట్లను పెంచితే అంతా మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. కాబట్టి చెట్ల పెంపకం విషయంలో వాస్తు నియమాలను పాటించి, ప్రతికూల ఫలితాల నుంచి బయటపడి సానుకూల దృక్పథం తో సంతోషంగా జీవించండి.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
vastu tips: దీపారాధనలో వాడే ఒక్కో నూనెతో ఒక్కో ప్రయోజనం.. తెలుసుకోండి!!
[ad_2]
Source link
Leave a Reply