లేవగానే ఈ పనులు చెయ్యండి .. శనివారం ఈ పనులు చెయ్యండి

వాటిలో ముఖ్యంగా ప్రతి శనివారం నాడు ఇంట్లో పగిలిన, విరిగిపోయిన వస్తువులను బయట పారేయాలని చెబుతున్నారు. శనివారంనాడు బూజు దులపడం, ఇల్లు శుభ్రం చేయడం చేస్తే కూడా మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఉదయం లేవగానే రెండు అరచేతులను చూసుకుని ఆ రోజును ప్రారంభిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడడానికి పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన ఏదైనా వస్తువు ఉంటే ఆ రోజు శుభం జరుగుతుందని చెబుతున్నారు.

పర్సులో డబ్బులు ఉండకపోతే ఈ పని చెయ్యండి

పర్సులో డబ్బులు ఉండకపోతే ఈ పని చెయ్యండి

మీ పర్సులో ఎప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతుంటే, ఎరుపు రంగులో ఉండే పర్సులను వాడితే కాస్త ఖర్చు తగ్గుతుంది అని చెబుతున్నారు. అవసరానికి మించి డబ్బు రావడంలేదని భావిస్తే కులదైవాన్ని మొక్కులు చెల్లించుకోవడం మంచిది అని, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోతే, సంపాదించిన డబ్బులు 10% దానధర్మాలు చేస్తే ఆర్థిక నిలకడ చేకూరుతుందని చెబుతున్నారు. ఒకవేళ డబ్బులకు ఇబ్బందిగా అనిపిస్తే చిన్న పిల్లలకు స్వీట్లు పంచితే ఇబ్బంది తొలగిపోతుందని చెబుతున్నారు.

డబ్బులు బాగా రావాలంటే ఈ పని చెయ్యండి

డబ్బులు బాగా రావాలంటే ఈ పని చెయ్యండి

ఇక పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయ పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. ధనప్రాప్తి కోసం ఏదైనా అమ్మవారి ఉపాసన చేయడం మంచిదని, అమ్మవారి వద్ద ఒక లవంగాన్ని ఉంచి ఉపాసన చేస్తే డబ్బు వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఏడవకుండా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు.

డబ్బులు పెట్టే చోట ఇవి తప్పనిసరిగా పెట్టండి

డబ్బులు పెట్టే చోట ఇవి తప్పనిసరిగా పెట్టండి

ప్రతి రోజూ పూజలో శ్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోవాలని, డబ్బులు పెట్టే చోట కొన్ని అక్షింతలు, నాలుగు లక్ష్మీ గవ్వలు, నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు, నాలుగు శ్రీ ఫలాలు, శ్రీ సూక్తం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఎప్పుడూ 2 లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రం దగ్గర ఉంచుకోవడం వల్ల కూడా డబ్బుకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఇక పొదుపు చేయదలచుకున్న వారంతా భరణి నక్షత్రం ఉన్నప్పుడు పొదుపు చేస్తే కలిసి వస్తుందని, డబ్బు ఖర్చు కాకుండా ఉంటుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

vastu tips: చెట్లు - వాస్తు; ఈ చెట్లు ఇళ్ళలో పెంచితే సిరిసంపదలకు లోటుండదు!!vastu tips: చెట్లు – వాస్తు; ఈ చెట్లు ఇళ్ళలో పెంచితే సిరిసంపదలకు లోటుండదు!!Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *