[ad_1]
టెర్రస్ పైన ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం
చాలామంది ఇంటిపైన వినియోగించని అనేక వస్తువులను పడేస్తూ ఉంటారు. పాడైపోయిన వస్తువులు, చెత్తాచెదారం ఇంటికి పైన జమ చేస్తూ ఉంటారు. ఎప్పుడో కాని టెర్రస్ మీదకు వెళ్ళం కదా అని ఏది పడితే అది పైన పోగు పెడుతూ ఉంటారు. ఇంటి టెర్రస్ పైన ఎప్పుడూ పాత వస్తువులను, పాడైపోయిన వస్తువులను పెట్టకూడదు. చెత్తాచెదారాన్ని జమ చేయకూడదు. అలా చేస్తే ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంటి పైన జమ చేసిన చెత్త ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు పేదరికం తెచ్చి పెడుతుంది. కాబట్టి ఇంటి పైన కప్పుపై ఎప్పుడు చెత్తాచెదారాన్ని జమ చేయకుండా ప్రతికూలతను తొలగించే ప్రయత్నం చేయాలి.
ఇంటి టెర్రస్ పై పెట్టుకోవాల్సినవి ఇవే
ఇంటి టెర్రస్ పైన చెత్త ఉంటె అది మన తలభారంగా మారుస్తుంది. అందుకే వాటిని తీసేసి సానుకూల శక్తి ప్రసరించే విధంగా ఇంటి పైన చక్కని గార్డెనింగ్ చేయవచ్చు. వాస్తు ప్రకారం మన ఇళ్లల్లో పెంచుకోవలసిన మొక్కలను ఇంటి టెర్రస్ పైన అందంగా పెంచుకుంటే, అది ఇంటికి శ్రేయస్సును తీసుకొస్తుంది. ఇంటి పైకప్పును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ కుటుంబ సభ్యులకు సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయి. అప్పుడప్పుడు టెర్రస్ మీద కూర్చోవటం కుటుంబానికి ఆహ్లాదం ఇస్తుంది.
కుటుంబానికి శ్రేయస్సు, సంతోషం కోసం టెర్రస్ పై ఈ పని చెయ్యండి
టెర్రస్ పైన మొక్కలు పెంచడం శుభప్రదం అని వాస్తులో కూడా సూచించబడింది. మొక్కల్ని పెంచడం వల్ల పర్యావరణం శుభ్రం అవ్వడమే కాకుండా, ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా పూల మొక్కలను ఇంటి టెర్రస్ పైన పెట్టుకున్నట్లయితే ఆ మొక్కలకు పూసిన పూలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. ఇక ఆకుపచ్చని మొక్కలు కుటుంబ సభ్యులకు ప్రశాంతమైన నిద్రని ఇస్తాయి. ఆ కుటుంబంలో సంతోషాన్ని మేల్కొల్పుతాయి.
జీవితంలోకి సానుకూల శక్తి ప్రవహించేలా.. జాగ్రత్త అవసరం
అందుకే ఇల్లు, ఇంట్లోని గదులు మాత్రమే కాకుండా టెర్రస్ విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం కూడా ఆయా కుటుంబ కుటుంబ సభ్యుల జీవితం పైన కచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి టెర్రస్ పైన చెత్తాచెదారాన్ని తీసేసి, అందమైన మొక్కలతో.. ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్కలతో మీ జీవితంలోకి సానుకూల శక్తి ప్రవహించేలా, సంతోషంగా జీవించేలా మార్చుకోండి. ఇది మీ జీవితానికి అదృష్టాన్ని, ధనాన్ని తెచ్చి పెడుతుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
[ad_2]
Source link