హోలీ నాడు సంతోషం, సంపద రావాలంటే తెలుసుకోవాల్సింది ఇదే

హోలీ పండుగ దేశవ్యాప్తంగా, దీపావళి తర్వాత అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి. జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి, బ్రతుకు రంగుల మయం కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ జరుపుకునే కలర్ ఫెస్టివల్. ఇక ఈ హోలీ పండుగను ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే హోలీ పండుగ సందర్భంగా సంతోషం సంవత్సరం అంతా ఉండాలంటే, సంపద పుష్కలంగా రావాలంటే, సుఖశాంతులతో జీవనం సాగించాలంటే కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయని, చేయకూడని వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వివరాల్లోకి వెళితే..

హోలీ పండుగ నాడు ఈ పనులు చెయ్యండి

హోలీ పండుగ నాడు ఈ పనులు చెయ్యండి

హోలీ పండుగ రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఇల్లు శుభ్రంగా ఉంచుకొని, ఆరోజు విష్ణువును పూజ చేయాలి. ఇంట్లో చెత్తా చెదారం లేకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. పండుగ రోజు సంతోషంగా, ఎటువంటి భేషదాలు లేకుండా, ఎవరి పైన ఎటువంటి కోపం లేకుండా పండుగను చేసుకోవడానికి సిద్ధమవ్వాలి. హోలీ పండుగ నాడు హోలీ ఇంటి ప్రాంగణంలోనే హోలీ ఆడాలి. అంతేకాదు పగటి సమయంలోనే హోలీ ఆడుకోవాలి. పొరపాటున కూడా పండుగనాడు ఎవరిని అవమానించకూడదు.

హోలీ పండుగ నాడు వాస్తు దోషాల నివారణకు చెయ్యాల్సింది ఇదే

హోలీ పండుగ నాడు వాస్తు దోషాల నివారణకు చెయ్యాల్సింది ఇదే

హోలీ పండుగ నాడు ఇంటి పెద్దల వద్ద వారి ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది. హోలీ పండుగ నాడు ఇంట్లో వండిన ఆహారాన్ని భగవంతునికి నివేదించిన తర్వాతే తింటే శుభం చేకూరుతుంది. హోలీ పండుగకు ముందు దహనం చేసిన బూడిదను ఇంటికి తెచ్చుకొని ఇంట్లో నాలుగు మూలల్లోనూ వేస్తే వాస్తు దోషాల నివారణ జరుగుతుంది. పసుపు, నల్ల నువ్వులు, ఆవాలు, జాజికాయ ఒక నల్లటి వస్త్రంలో కట్టి, దానిని జేబులో పెట్టుకుంటే మంచి జరుగుతుంది. హోలీ పండుగ నాడు ఆంజనేయుడి ఆరాధన చేయడం మంచిదని సూచించబడింది.

హోలీ పండుగ నాడు చేయకూడని పనులివే.. ఇవి చేస్తే అరిష్టం

హోలీ పండుగ నాడు చేయకూడని పనులివే.. ఇవి చేస్తే అరిష్టం

ఇక హోలీ పండుగ రోజు చేయకూడని పనుల విషయానికి వస్తే పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత హోలీ ఆడకూడదు. అలా ఆడితే అరిష్టం వస్తుంది . హోలీ పండుగ రోజు మద్యం సేవించకూడదు. ఎవరినీ దుర్భాషలాడకూడదు. పండుగ నాడు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. హోలీ పండుగ రోజున తెల్లటి వస్తువులకు దూరంగా ఉండాలి. హోలీ పండుగ నాడు ఎవరికి ఎటువంటి హాని చేకూర్చకూడదు. అలా చేస్తే మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరగదు. హోలీ పండుగ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. చాలా పవిత్రంగా విష్ణువును, రాధా కృష్ణులను పూజించే ఈ పండుగను ఘనంగా భక్తి, ప్రేమలతో జరుపుకోవాలి.

Vastu tips: హోలీనాడు ఈ పనులు చేస్తే దరిద్రం పరార్!!Vastu tips: హోలీనాడు ఈ పనులు చేస్తే దరిద్రం పరార్!!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *