అసలు ఏం జరిగింది..?

డిజైన్ ఏజెన్సీ లేట్ చెక్అవుట్, CEO గ్రెగ్ ఇసెన్‌బర్గ్ కు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆయన వద్ద సేవలు పొందిన క్లైంట్ 109,500 డాలర్ల విలువైన సేవలు పొంది ఆ డబ్బు తిరిగి చెల్లించలేదు. అయితే దీనికి పరిష్కారం కనుగొనే క్రమంలో ఆయన ప్రపంచ వ్యాప్తంగా తుఫానుగా మారిన చాట్ జీపీజీని వినియోగించాడు. చాట్ జీపీటీ ఇచ్చిన పరిష్కారం ఆయన తలరాతను మార్చేసింది.

లాయర్ ఖర్చు లేకుండా..

చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి సాధారణంగా మనం లాయర్లను సంప్రదిస్తాం. అయితే ఇందుకు కొత ఖర్చవుతుంది. ఈ క్రమంలో గ్రెగ్ ఇసెన్‌బర్గ్ మాత్రం చాట్ జీపీటీని సంప్రదించాడు. చాట్ జీపీటీ సాయంతో తన సమస్యకు పరిష్కారం కనుగొని ఒక లీగల్ నోటీసు సిద్ధం చేశాడు.

నెలలు వేచి ఉన్నాక..

దాదాపు కంపెనీకి రావాల్సిన బిల్లును క్లైంట్ 5 నెలలుగా చెల్లించలేదు. దీంతో చివరి అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలుపుతూ.. వెంటనే స్పందించకుంటే చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందులో వెల్లడించాడు. సకాలంలో స్పందించకపోతే తీసుకునే లీగల్ చర్యల ఖర్చులు సైతం మీరే భరించాల్సి ఉంటుందని అందులో తెలిపాడు. అయితే ఈ విషయాన్ని మెయిల్ ద్వారా డబ్బు చెల్లించని క్లైంట్ కు పంపాడు. దీంతో వాళ్లు వెంటనే స్పందించి కంపెనీకి డబ్బు తిరిగి చెల్లిస్తామని తక్షణం జవాబిచ్చారు.

నెటిజన్ల కామెంట్స్..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ జీపీటీ ఇప్పటి వరకు పెద్ద శాపంగా అందరూ భావించారు. అయితే తాను మాత్రం దీనిని గుడ్ కాప్ గా భావిస్తున్నాని సీఈవో గ్రెగ్ ఇసెన్‌బర్గ్ ట్విట్టర్ ఖాతాలో తెలిపాడు. దీనిపై స్పందించిన ఒక నెటిజన్ మంచి ఆలోటన అని అన్నారు. ఇదే క్రమంలో స్పందించిన మరో వ్యక్తి లాయర్లు దీనిని చూసి నేర్చుకోవాలన్నారు. వారు కనీసం చిన్న లీగల్ నోట్ రాయాలన్నా కనీసం 1000 డాలర్లు వసూలు చేస్తున్నారని.. గతంలో వందల సార్లు చేసిన పని చేయాలన్నా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారని అన్నారు. తన లా విద్యార్థులకు దీని గురించి తప్పక తెలుపుతానని అన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *