Tuesday, May 17, 2022

viral photo: ఆకాశంలో తేలుతోన్న ఓడ -గ్రాఫిక్ కాదు, అచ్చ తెలుగులో దృష్టి భ్రాంతి

International

oi-Madhu Kota

|

‘ఏమో.. గుర్రం ఎగరావచ్చు..’ అనే జమానా ఊహను.. గ్రాఫిక్స్ లో నిజం చేసి చూపిస్తారు ఈనాటి గడుగ్గాయిలు. ఇదిగో… ‘ఆకాశంలో తేలుతోన్న ఓడ’ ఫొటోను మొదటిగా చూసినవాళ్లంతా ఇదేదో గ్రాఫిక్ మాయాజాలం అనుకున్నారు. కానీ ఇందులో ఒక్క బిట్ గ్రిఫిక్ కూడా లేదు. అచ్చంగా కెమెరాతో చిత్రీకరించిందే..

జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు

టెక్నాలజీతోపాటే ఫేక్ ప్రచారాలూ వేగంగా వ్యాప్తి చెందుతోన్న రోజులివి. ‘ఫ్యాక్ట్ చెక్’ ఫిల్టర్లను దాటుకుంటూ మరీ గ్రాఫిక్ వీడియోలు, ఫొటోషాప్ చిత్రాలు వైరలైపోతున్న వైనం మనమంతా చూస్తున్నాం. అందుకే కాబోలు, చాలా రోజుల తర్వాత ఒరిజినల్ వండర్ లా అగుపించింది కాబట్టే ప్రస్తుతం ఇది వైరల్ ఫొటోగా మారింది. వివరాల్లోకి వెళితే..

నీటిపై ప్రయాణించాల్సిన ఓడ.. ఆకాశంలో తేలుతున్నట్లు కనిపిస్తోన్న ఈ దృశ్యం కెనడాలోని బాన్ఫ్ పట్టణంలో కనిపించింది. కొలిన్ మెక్‌కల్లమ్‌ అనే రోడ్డుపై కారులో వెళుతుండగా.. ఎదురుగా ఉన్న సముద్ర తలానికిపైన.. ఆకాశంలో కార్గొ షిప్ తేలాడుతున్నట్లుగా కనిపించింది. ఆ దృశ్యాన్ని నమ్మలేకపోయిన కొలిన్.. తాను దృష్టి భ్రాంతికి గురయ్యానని గ్రహించాడు. వెంటనే..

viral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లు

కొలిన్ తన మొబైల్‌లో ఆ ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఇవాళ రియల్ లైఫ్ ఆప్టికల్ ఇల్యూషన్’ చూశానంటూ కొలిన్ పోస్ట్ చేసిన ఫొటో గంటల వ్యవధిలోనే ప్రపంచం నలుమూలలకు పాకింది. సముద్రం అలలపై మబ్బుల నీడ పడటంతో ఆ ఓడ ఉన్న చోటు ఆకాశంగా కనిపించిందని, దీంతో ఆ షిప్‌ గాల్లో తేలుతున్నట్లుగా ఉన్నదని నిపుణులు తేల్చేశారు. సముద్ర తీరంలో మేఘాలు కమ్ముకుని ఉండటం కూడా ఓ కారణమని ఇంకొందరు చెబుతున్నారు. అదీ సంగతి.

viral photo: ఆకాశంలో తేలుతోన్న ఓడ -గ్రాఫిక్ కాదు, అచ్చ తెలుగులో దృష్టి భ్రాంతి


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe