Tuesday, March 9, 2021

Viral Video:ప్రేమ ధైర్యం రెండు ఒకే చోట.. నాగుపాము దాహం తీర్చిన ఇతనికి సలాం..!

వాటర్ బాటిల్ నుంచి…

సాధారణంగా పాలు పోసినవాడినే పాము కాటు వేసి చంపుతుందని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదుగానీ… ఓ పాము ఎంచక్కా వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఓ వ్యక్తి ఆ నాగుపాముకు మంచి నీళ్లను వాటర్ బాటిల్ నుంచి పట్టిస్తున్నాడు. అయితే ఈ వీడియో మూడేళ్ల క్రితమే ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చినప్పటికీ మళ్లీ ట్విటర్‌లో వైరల్ అవుతుండటంతో వార్తల్లో నిలిచింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయగానే తిరిగి బోలెడన్నీ షేర్లు లైకులు వచ్చాయి.

సోషల్ మీడియాలో వైరల్

ఇక వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అటవీశాఖ సిబ్బంది. ముందుగా వాటర్ బాటిల్ మూతను తీయగానే దాహంతో ఉన్న ఆ నాగుపాము చకచకా నీళ్లు తాగేసి దాహం తీర్చుకుంది. బాటిల్‌ను పాము ముందు ఉంచగానే గటగటా తాగేసింది ఈ ఇండియన్ కోబ్రా.దాదాపుగా లక్ష మంది ఈ వీడియోను చూశారు. అంతేకాదు వారికి తోచినట్లుగా సరదా కామెంట్స్ కూడా రాసుకొచ్చారు. అయితే చాలామంది జంతుప్రేమికులు మాత్రం నీళ్లు అందించిన ఈ అటవీశాఖ సిబ్బందిపై ప్రశంసల జట్టు కురిపించారు. పాము విషపూరితమైనదని తెలిసి కూడా ధైర్యం చేసి ఆ మూగజీవానికి దాహం తీర్చాడని పేర్కొంటూ మెచ్చుకున్నారు.

 సిబ్బంది ప్రేమకు సలాం చేసిన నెటిజెన్లు

సిబ్బంది ప్రేమకు సలాం చేసిన నెటిజెన్లు

ఆ వ్యక్తి ప్రదర్శించిన ధైర్యానికి కూడా మరికొందరు సలామ్ చేశారు. ధైర్యం ప్రేమ రెండు ఒకేచోట కనిపించాయని మరికొందరు ట్వీట్ చేశారు. మరికొందరైతే ఈ వీడియోకు ఒక్కింత హెచ్చరిక ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విషపూరితమైన పాములతో చెలగాటం తగదని శిక్షణ పొందిన వారు మాత్రమే ఇలాంటి సాహసాలు చేయాలని రాసి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. అయితే ఇలా ఒక నాగుపాముకు నీళ్లు పట్టిన వీడియో వైరల్ కావడం తొలిసారి కాదు… 2017లో కూడా కర్నాటకలోని కైగా గ్రామంలోకి ఓ పాము దాహంతో రాగా ఓ వ్యక్తి దానికి నీళ్లు పట్టించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.


Source link

MORE Articles

viral video: టీకా తీసుకోమంటే నవ్వుతున్న పోలీసు.. నర్సు తాకగానే చక్కిలిగింతలతో..

టీకా కోసం వచ్చిన ఈ నాగాలాండ్ పోలీసు నర్సు తాకగానే నవ్వులు మరికొందరు టీకా ఇచ్చే సమయంలో ఏడవడం, మరికొందరు ఏమి తెలియనట్లుగా అయిపోయిందా? అంటూ...

Google Fit Gets Heart Rate, Respiratory Rate Measurement on Pixel Phones

Google Fit app is now rolling out the ability to measure heart rate and respiratory rate through phones. These new features are rolling...

జగన్ తో మాట్లాడాకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం .. కేసుల నుండి రక్షించుకునే బేరం : మాజీ ఎంపీ సబ్బం హరి

ప్రైవేటీకరణకు జరిగిన ఒప్పందంలో వైసీపీ నేతలు భాగస్వాములు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జరిగిన ఒప్పందంలో వైసీపీ నేతలు భాగస్వాములైన విషయం అందరికీ తెలుసు అని...

इन 5 घरेलू तरीकों से करें फल और सब्जियों को सेनेटाइज, नहीं रहेगा किसी भी तरह के वायरस का डर

नई दिल्ली: आप चाहें माने या न मानें पर ये सच है कि जिन फलों और सब्ज‍ियों को हम सेहत बनाने के लिए...

r/technology – How Toyota thrives when the chips are down

submitted by /u/CaesarTheDad Source link

सुबह खाली पेट तांबे के बर्तन में रखा पानी पीने से मिलते हैं जबरदस्त फायदे, जानिए

नई दिल्ली: सेहत की बेहतरी के लिए लोग कई तरीके अपनाते है. इन्हीं में से एख है तांबे (Copper) के बर्तन में पानी...

Kathleen Folbigg: 18 साल से जेल में बंद है ‘सीरियल किलर मां’, अब वैज्ञानिकों का दावा-उसने नहीं की बच्चों की हत्या

नई दिल्ली: ऑस्ट्रेलिया (Australia) के वैज्ञानिक और डॉक्टर एक ऐसी सीरियल किलर मां को माफी देने की बात कर रहे हैं, जिस पर...

రైతుల ఆందోళన ఉధృతం : అవసరమైతే లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరిక

ప్రభుత్వంపై విరుచుకుపడిన రైతు సంఘం నాయకులు ఒకపక్క బోర్డర్లో ఆందోళన కొనసాగిస్తూనే, మరోపక్క వివిధ రాష్ట్రాల ప్రజల నుండి ,రైతుల నుండి మద్దతు కూడగడుతున్నారు. ఇక...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe