రాహుల్ వీడియోలు వైరల్..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మూడు రోజుల తమిళనాడు పర్యటనకు విచ్చేసిన రాహుల్ గాంధీ ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు. విద్యార్థులతో ఆడిపాడి, తన పాటవాన్ని ప్రదర్శించారు. తమిళనాడులోని ములగుమూదుబ్న్ సెయింట్ జోసెఫ్స్ మెట్రిక్యులేషన్ విద్యార్థులతో కలిసి రాహుల్ డ్యాన్స్ చేయడం, పదో తరగతి అమ్మాయితో పుష్-అప్స్ ఛాలెంజ్, మరో విద్యార్థికి మార్షల్ ఆర్ట్స్ ‘ఐకిడో’ మెలకువలు నేర్పిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా,

బీజేపీ బతకనీయదేమో..
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్.. విద్యార్థులతో మమేకం కావడంతోపాటు పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తు కొనసాగిస్తోన్న కాంగ్రెస్.. రాబోయే రెండు రోజుల్లో సీట్ల షేరింగ్ ను ఖరారు చేయనుంది. కాగా, ఇటీవల పుదుచ్చేరిలో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు చేశారు రాహుల్. ఏదైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ, బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులతో ఆ ప్రభుత్వాలను బతకనీయడంలేదని, బేరాలాడిమరీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దీనిపై

బీజేపీ బేరం.. కాంగ్రెస్ అమ్మకం..
కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించినప్పటికీ ఆయా ప్రభుత్వాలను బీజేపీ బతకనీయడం లేదన్న రాహుల్ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ చమత్కారపూరిత విమర్శలు చేశారు. ‘‘రాహుల్ చెప్పింది నిజం. కాంగ్రెస్ మెజార్టీ సాధించినా, బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూలగొడుతూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇది బీజేపీ బేరాలాట, కాంగ్రెస్ అమ్మకాల ఆట. ఇది తెలుసు కాబట్టే కేరళ ప్రజల కచ్చితంగా ఎల్డీఎఫ్ ను సమర్థిస్తారు” అని విజయన్ ట్వీట్ చేశారు. కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. పశ్చిమ బెంగాల్ లో మాత్రం పొత్తు కుదుర్చుకోవడం తెలిసిందే.