Thursday, May 6, 2021

viral video: కస్టమర్ల కోసం కొట్టుకు చచ్చారు -యూపీలో చాట్ వ్యాపారుల అరాచకం

వీధి రౌడీల్లా వ్యాపారులు..

ఉత్తరప్రదేశ్ లోని బాగ్‌పట్ పట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం కాస్త భయానక దాడి వరకు వెళ్లింది. కర్రలు, ఇనుప రాడ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగి నానా హంగామా సృష్టించారు. విక్షణారహితంగా కర్రలతో కొట్టుకుంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వీధి రౌడీలను మించి కొట్లాడుతోన్న ఈ వ్యక్తులు నిజానికి వీధి వ్యాపారులు..

చాట్ తినే కస్టమర్ల కోసం..

చాట్ తినే కస్టమర్ల కోసం..

బాగ్‌పట్ సిటీలో చాట్ దుకాణాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతంలో సోమవారం పట్టపగలు ఈ అరాచక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ దెబ్బకు వ్యాపారాలు దీవాళా తీసిన దరిమిలా, ఇప్పుడిప్పుడే పెరుగుతోన్న కస్టమర్లను ఆకట్టుకునేందుకు అక్కడి చాట్ వ్యాపారులు ఏవేవో ఉపాయాలు రచించారు. కానీ ఒక వర్గం ప్రయత్నాలను మరో వర్గం అడ్డుకుంది. అలా వాదనతో మొదలై, చివరకు తలలు పగలకొట్టుకునేంత వరకూ వెళ్లింది..

బాగ్‌పట్ పోలీసుల వివరణ..

బాగ్‌పట్ పోలీసుల వివరణ..

‘యూపీలో రాజ్యమేలుతోన్న అరాచకానికి ఇదొక మచ్చుతునక’ అని కొందరు, ‘అయ్యో, వీధి వ్యాపారుల బతుకులు ఇంతగా దిగజారాయా?’ అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, చాట్ వ్యాపారుల ఘర్షణ వల్ల బాగ్‌పట్ లో శాంతిభద్రతల సమస్యేదీ తలెత్తలేదని, ప్రస్తుతానికి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు చెప్పారు. రోడ్డుపై మారణాయుధాలతో గొడవపడ్డ ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మిగతా వారిని కూడా అరెస్ట్‌ చేసేందుకు గాలిస్తున్నారు.


Source link

MORE Articles

r/technology – Scammers Get Away With $2 Million From WallStreetBets Forum Members

Maybe it's a different mentality for those who have been doing this, but if I ever came into new money from the stock...

Algorithmic Architecture: Using A.I. to Design Buildings | Digital Trends

Designs iterate over time. Architecture designed and built in 1921 won’t look the same as a building from 1971 or from 2021. Trends...

ఏపీలో 20వేలకుపైనే కరోనా కేసులు : ఆ ఒక్క జిల్లాలోనే 3వేలకుపైగా, 1.82లక్షలకు యాక్టివ్ కేసులు

ఏపీలో కొత్తగా 21,954 కరోనా కేసులు, 72 మరణాలు తాజాగా నమోదైన 21,954 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,28,186కి చేరింది. గత...

HEALTH NEWS: कद्दू के बीजों का पुरुष ऐसे करें सेवन, फिर देखें कमाल!

नई दिल्ली: अगर आप कद्दू खाते होंगे तो उसके बीजों का क्या करते हैं? कहीं फेंक तो नहीं देते? यदि फेंक देते हैं,...

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

ఇది మాత్రమే కాకుండా హోండా యాక్టివా 6 జి యొక్క 20 వ యానివర్సరీ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీనిని మార్కెట్లో ప్రస్తుతం 69,343 రూపాయలకు...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe