Wednesday, March 3, 2021

Viral video : జరిమానాకు బదులు ముద్దు… నడిరోడ్డుపై యువతితో పోలీస్ లిప్‌లాక్…

National

oi-Srinivas Mittapalli

|

సాధారణంగా ఎవరైనా కోవిడ్ 19 నిబంధనలు పాటించకపోతే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు… అందుకు తగిన జరిమానా విధిస్తారు… ఎక్కడైనా అంతే కదా… కానీ సౌత్ అమెరికాలోని పెరూ దేశంలో మాత్రం ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ 19 నిబంధనలు పాటించని ఓ బాధితురాలికి పెనాల్టీకి బదులు ముద్దు పెట్టేశాడో పోలీస్ అధికారి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… పెనాల్టీకి బదులు కిస్‌ ఇస్తానని ఆ అమ్మాయే పోలీస్ అధికారికి చెప్పింది. దీంతో సదరు పోలీస్ అధికారి ఫైన్ సంగతి పక్కనపెట్టి ఆమెతో లిప్‌లాక్ చేశాడు. పెరూలోని లిమా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పెరూలో ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉంది. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కర్ఫ్యూ సమయంలో ఓ యువతి బయటకు వచ్చింది. ఇది గమనించిన పోలీస్ అధికారి ఆమె వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు చేతిలో పెన్ పేపర్ పట్టుకుని జరిమానా విధించేందుకు సిద్దమయ్యాడు. కానీ ఇంతలోనే ఆ యువతి అతనికి దగ్గరగా జరిగి ఏదో మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడిందో తెలియదు గానీ.. వెంటనే సదరు పోలీస్ ఆమెకు దగ్గరగా జరిగి మాస్క్ తొలగించాడు. ఆ వెంటనే లిప్‌ కిస్ ఇచ్చాడు. కొన్ని సెకన్ల పాటు ఇద్దరూ లిప్‌లాక్‌లో ఉన్న ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

Video shows policeman kissing woman instead of fining her in Peru

విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘించిన యువతికి జరిమానా విధించాల్సిందిపోయి బహిరంగ ప్రదేశంలో లిప్‌లాక్ చేసి ఆ పోలీస్ అధికారి కూడా నిబంధనలు ఉల్లంఘించాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో పెరూ పోలీస్ విభాగం అతన్ని సస్పెండ్ చేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది.

కాగా,పెరూలో ఇప్పటివరకూ 12,61,804 మంది కరోనా బారినపడగా… 44వేల మంది మృతి చెందారు. కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుండటంతో గత నెల నుంచి పెరూలో మరోసారి లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Source link

MORE Articles

విజయసాయి కౌంటర్: గంటా వచ్చినా.. రాకున్న నో ఫరక్! మైండ్‌గేమ్ అవసమే లేదు

గంటా ప్రతిపాదనలు పంపారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని గంటా శ్రీనివాసరావు గతంలో ప్రతిపాదన పంపారని, దానిపై సీఎం వైఎస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని...

Microsoft and IBM use apprentice programs to diversify the tech world and solve the labor shortage

Apprenti works with tech companies in 15 states to expand the pipeline of software engineers,...

ఏనుగు ప్యాంటేస్తే Ele-Pant… -వైర‌ల్ పిక్‌ను షేర్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా

మిగతా పారిశ్రామికవేత్తలకు భిన్నంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, దేశసమకాలీన పరిస్థితులపై స్పందించడం ఆనంద్ మహీంద్రాకు అలవాటు. తన దృష్టికి వచ్చిన సందేశాత్మక, ఫన్నీ ఫొటోలు, వీడియోలను ఎప్పుడూ సోషల్‌మీడియాలో పంచుకుంటారాయన....

నిర్మల భర్త పరకాల ప్రభాకర్ సంచలనం -ప్రధాని మోదీ భయానక తప్పిదం -ఎల్బీ స్డేడియం, ప్రకాశం జిల్లా?

మిడ్ వీక్ మ్యాటర్స్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీహెచ్‌డీ పట్టాపొందిన పరకాల ప్రభాకర్.. డేటా సైన్స్, పొలిటికల్ అనాలసిస్, డిజిటల్ మార్కెటింగ్ లోనూ రాణించారు....

Google promises to stop selling your browsing history to advertisers

In brief: Google explicitly says that when it phases out tracking...

విజయసాయి రెడ్డే చెప్పాలి: పార్టీ మార్పు, సీఎంకు ప్రతిపాదనలపై తేల్చేసిన గంటా శ్రీనివాసరావు

ఇది వైసీపీ మైండ్ గేమ్.. 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు వందసార్లు తాను పార్టీలు మారుతానని పుకార్లు వచ్చాయని గంటా శ్రీనివాస్ చెప్పారు. విజయసాయి...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe