Tuesday, September 21, 2021

Viral Video : బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగా హనుమాన్ చాలీసా పఠించిన పేషెంట్…

India

oi-Srinivas Mittapalli

|

ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌ ఆస్పత్రిలో 24 ఏళ్ల ఓ యువతికి మెదడు భాగంలో సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. మెదడులో కణతిని తొలగించే ఈ సర్జరీ కోసం కేవలం లోకల్ ఎనస్థీషియా మాత్రమే ఇచ్చి యువతి మెలుకువలో ఉండగానే శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స జరిగిన మూడున్నర గంటల సేపు యుక్తి అగర్వాల్ అనే యువతి హనుమాన్ చాలీసా పఠించడం గమనార్హం. అంతేకాదు,సర్జరీ సమయంలో ఆమె వైద్యులతోనూ సంభాషించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డా. దీపక్ గుప్తా నేతృత్వంలోని వైద్యుల బృందం జులై 23న ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం యుక్తి అగర్వాల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పేషెంట్ మెలుకవలో ఉండగానే నిర్వహించే సర్జరీని ‘అవేక్ క్రానియోటోమీస్’గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. పేషెంట్ మెలుకువతో,అప్రమత్తంగా ఉండటం ద్వారా సర్జరీ సమయంలో మెదడులోని కీలక భాగాలకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుందని చెబుతున్నారు. ఎయిమ్స్ వైద్యులు గత 20 ఏళ్లలో ఇలాంటి సర్జరీలు ఎన్నో విజయవంతంగా నిర్వహించారు.

సర్జరీ సమయంలో నొప్పి తెలియకుండా ఉండటం కోసం యువతికి లోకల్ ఎనస్థీషియా ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.దీని ద్వారా యువతి మెదడు భాగంలో నొప్పి తెలియదని… అదే సమయంలో ఆమె స్పృహలోనే ఉంటారని తెలిపారు. యుక్తి అగర్వాల్ త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటారని చెప్పారు.

గతేడాది లండన్‌లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. 53 ఏళ్ల ఓ వ్యక్తికి అక్కడి కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యులు మెదడుకు శస్త్ర నిర్వహించారు. మెదడులో కణతిని తొలగించేందుకు ఈ శస్త్ర చికిత్స నిర్వహించగా… ఆ సమయంలో సదరు పేషెంట్ వయోలిన్ వాయించడం గమనార్హం. తద్వారా ఆ సమయంలో మెదడు మరింత చురుగ్గా ఉంటుందని… ఆపరేషన్‌కు అది దోహదపడుతుందని వైద్యులు తెలిపారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వైద్యులు సైతం అవేక్ బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. రోగికి బిగ్‌బాస్ షో చూపిస్తూ వైద్యులు అతనికి సర్జరీ పూర్తి చేశారు.అత్యాధునిక న్యూరో నావిగేషన్‌ వైద్య విధానంలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ సర్జరీ ఇదేనని వైద్యులు చెప్తున్నారు.

English summary

A 24-year-old woman recited devotional verses of the Hanuman Chalisa while doctors at the All India Institute of Medical Sciences (AIIMS) performed a complex surgery on her brain to remove a tumour.




Source link

MORE Articles

పొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకం

టీఆర్ఎస్ మంత్రులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు .. డిఫెండ్ చేస్తున్న మంత్రులు తెలంగాణ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ...

Salesforce invests in Indian fintech unicorn Razorpay

The funding may have pushed Razorpay's valuation to over US$3 billion, Livemint reported. Source link

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Apple iOS 15 cheat sheet: Everything you need to know

Get details about the new features of iOS 15, find out if it will work...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe